Jai Bhim first look trending: సూర్య ఫస్ట్‌లుక్ పోస్టర్ వైరల్.. సోషల్ మీడియాలో రచ్చ!
సూరారై పోట్రూ విజయం తర్వాత కార్తీక్ తన కెరీర్‌లో నటిస్తున్న 39వ చిత్రానికి టైటిల్‌ను జై భీమ్ అని ఖరారు చేశారు. సూర్య బర్త్ డేను పురస్కరించుకొని లాయర్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను జూలై 23న రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య సరసన రజీషా విజయన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది. సామాజిక న్యాయం, అంశాలు, కులం వివక్ష లాంటి నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాకు ఫస్ట్‌లుక్ మంచి అంచనాలు పెంచింది.

సూర్య సోషల్ మీడియాలో
జై భీమ్ పోస్టర్‌ను అభిమానులతో పంచుకొంటూ సూర్య సోషల్ మీడియాలో స్పందించారు. జై భీమ్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను షేర్ చేసి మీతో ఆనందం పంచుకోవడం చాలా ఎక్సైటింగ్‌గా ఉంది అంటూ ట్వీట్ చేశారు. సూర్య చేసిన ట్వీట్ కొద్ది సేపట్లోనే వైరల్ అయింది. అభిమానులు లుక్‌పై ప్రశంసలు కురిపించారు.

సూర్యకు బర్త్ డే విషెస్
జై భీమ్ పోస్టర్ రిలీజైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. సూర్య 39, జై భీమ్ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ అయ్యాయి. ఈ పోస్టర్‌ను అభిమానులు షేర్ చేస్తూ.. సూర్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తమ అభిమానులు స్పూర్తిదాయకమైన పాత్రలో కనిపించడంపై ప్రశంసల వర్షం కురిపించారు.

బీఆర్ అంబేద్కర్ స్పూర్తిగా
ఇక బీఆర్ అంబేద్కర్‌ను స్పూర్తిగా తీసుకొని జై భీమ్ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు స్పష్టమైంది. అణగారిన ప్రజల సంక్షేమం కోసం పాటుపాడే లాయర్‌గా సూర్య కనిపించబోతున్నారు. కొద్ది నెలల క్రితం ఈ సినిమా షూటింగులోని లాయర్ పాత్రకు సంబంధించిన ఫోటో మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో
2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై జై భీమ్ చిత్రాన్ని రాజశేఖర్ పాండ్యన్ నిర్మిస్తున్నారు. విలక్ష నటుడు ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఆర్ కథీర్ సినిమాటోగ్రఫిని, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా, అంబ్రీవ్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.


Click it and Unblock the Notifications











