»   » రజనీ కాంత్ పై యుద్దం ప్రకటిస్తున్న జెడి చక్రవర్తి

రజనీ కాంత్ పై యుద్దం ప్రకటిస్తున్న జెడి చక్రవర్తి

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : రజనీకాంత్ పై యుద్దం ప్రకటించబోతున్నాడు జెడి చక్రవర్తి. అయితే అది నిజజీవితంలో కాదు. సినిమా తెరపైనే. రజనీకాంత్ తాజా చిత్రంలో జెడీ విలన్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. గ్యాంగ్ లు, గ్యాంగ్ వార్ లు అంటూ సాగే ఈ చిత్రంలో జెడి గ్యాంగ్ కే రజనీ కౌంటర్ ఇవ్వనున్నట్లు వినికిడి. ఈ తరహా పాత్రలో గతంలోనూ జెడీ కనిపించటంతో ఫెరఫెక్ట్ ఎంపిక అని చెన్నై వర్గాలు అంటున్నాయి. ఈ మేరకు జెడీ ఇప్పటికే మలేషియా చేరుకున్నట్లు సమాచారం. ఈ చిత్రలో రజనీకాంత్ మాఫియా నుంచి రిటైరయిన వ్యక్తిగా కనిపిస్తారు. కొన్ని అత్యవసర పరిస్ధితుల్లో ఆయన తిరిగి మాఫియా ముఠాలతో పోరాటం చేయటమే కధాంశం అంటున్నారు. సినిమా మొత్తం థ్రిల్స్ తో నిండి ఉంటుందంటున్నారు.

ఎప్పుడూ తమ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఎప్పుడెప్పుడు నటిస్తారా . అని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూంటారు. దానికి తోడు రీసెంట్ చిత్రం 'లింగ' అంచనాలు తలక్రిందులు చేసి ఫ్లాప్ కావటంతో తదుపరి చిత్రంపై ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపధ్యంలో ఎవరూ వూహించనివిధంగా ఆయన కొత్త దర్శకుడు రంజిత్‌కు అవకాశమిచ్చారు. ఓకే డైరక్టర్ ఖరారు అయ్యారు...మరి టైటిల్ ఏంటి...అంటే ...

ఇదే టైటిల్ అంటూ ఓ వార్త చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారంలోకి వచ్చింది. ఆ టైటిల్ ఏంటంటే... కాళీ. 1980లో రజనీకాంత్ హీరోగా చేసిన చిత్రం టైటిల్ అది. ఇప్పుడు అదే టైటిల్ ని మరోసారి రిపీట్ చేస్తున్నట్లు సమాచారం. సినిమాలో ఎక్కువ భాగం మలేషియాలో జరగనుంది.

ఇక ఆగస్టు 2వ తేదీ రజనీకాంత్ ఫ్యాన్స్ కు పండుగ తేదీ కానుంది. ఆయన కొత్త చిత్రం ఆ రోజు ఓపెన్ అవుతోంది. గత కొద్ది రోజులుగా రజనీకాంత్ ఫ్యాన్స్ చూస్తున్న ఎదురుచూపులుకు టైం వచ్చింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇంతకీ...

JD Chakravarthy is villan to Rajinikanth?

ఈ సినిమా ఎలా ఉండబోతోంది?.. . రజనీకాంత్‌ సరసన ఎవరెవరు నటిస్తున్నారు?.. రంజిత్‌ శైలిలో వాస్తవిక సినిమానా?.. అంటూ పలు రకాల ఆలోచనలో పడ్డారు అభిమానులు. గ్యాంగ్‌స్టర్‌కు సంబంధించిన కథతో రూపొందించనున్నట్లు కోడంబాక్కం సమాచారం. రజనీకాంత్‌ ఓకే చెప్పిన వెంటనే.. రంజిత్‌ ప్రస్తుతం విదేశాల్లో లొకేషన్లు వెతికే పనిలో పడ్డారు.

ఇక దర్శకుడు రంజిత్ ..విషయానికి వస్తే...అతనో యంగ్ డైరెక్టర్.. ఇప్పటివరకూ కేవలం రెండు చిత్రాలకే దర్శకత్వం వహించాడు.. అయితేనేం.. తన కథతో బడా ప్రొడ్యూసర్ ను ఒప్పించాడు... కోలీవుడ్ సూపర్ స్టార్ ను మెప్పించాడు. దీంతో రజనీకాంత్ నెక్స్ట్ మూవీకి దర్శకుడయ్యాడు రంజిత్.

రజనీకాంత్ తదుపరి చిత్రం విషయమై.. కొన్నాళ్లుగా శంకర్, కె.ఎస్.రవికుమార్ వంటి కోలీవుడ్ర్ డైరెక్టర్స్ క్యూలో ఉండగా.. వీరందరినీ కాదని... 'అట్టకత్తి', 'మద్రాస్' వంటి చిన్న చిత్రాలతో మెప్పించిన రంజిత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రజనీకాంత్.

తమిళ స్టార్ హీరోలతో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన అగ్రనిర్మాత కలైపులి థాను.. ఈ సినిమా నిర్మించనున్నారు. గతంలో థాను నిర్మించిన 'యార్' చిత్రంలో అతిథిపాత్ర పోషించిన రజనీకాంత్.. మళ్లీ ఇప్పుడు ఈ సంస్థలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు నిర్మాత థాను తెలియజేశారు.

తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కబోతోందట. సో.. పెదరాయుడు తర్వాత రజనీకాంత్ నటించనున్న స్ట్రయిట్ తెలుగు సినిమా ఇదే కానుంది. మరి.. లింగా వంటి ఘోర పరాజయం తర్వాత.. రజనీకాంత్ నటిస్తున్న ఈ సినిమా.. అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ ఏ మేరకు మెప్పిస్తుందేమో చూడాలి.

English summary
JD Chakravarthy has reportedly been roped in to play the antagonist's role in Superstar Rajinikanth's next film that is based on mafia and gang wars. The movie will go on floors in August and JD will be flying down to Malaysia to start shooting for the film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu