twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ దర్శకుడు బాలచందర్ ఆస్తులు వేలానికి... ఏం జరిగింది?

    By Bojja Kumar
    |

    ప్రముఖ దక్షిణాది సినీ దర్శకుడు, దాదా ఫాల్కే అవార్డు గ్రహీత, దివంగత కె. బాలచందర్ ఆస్తులపై ఓ ప్రైవేటు బ్యాంకు వేలం ప్రకటన వేయడంతో అభిమానులు షాకయ్యారు. ఎన్నో అద్భుతమైన సినిమాలు తీయడంతో పాటు , సినీ పరిశ్రమకు రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్లను, ఎంతో మంది హీరోలను, హీరోయిన్లను పరిచయం చేసిన ఆయన ఆస్తులు ఇలా వేలానికి రావడం అభిమానులను జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ వేలం వ్యవహారంపై బాలచందర్ కుమార్తె పుష్పా కందస్వామి స్పందించారు.

    Recommended Video

    K Balachander's Properties In Auction, no response from Rajini, Kamal
    వేలం నోటీసులు నిజమే

    వేలం నోటీసులు నిజమే

    యూకో బ్యాంకు నుండి వేలం ప్రకటన వచ్చిన మాట నిజమే అని, ఇతర ప్రొడక్షన్స్ సంస్థల మాదిరిగానే బాలచందర్ కు చెందిన కవితాలయా సంస్థ కూడా ఓ టీవీ సీరియల్ నిర్మాణం కోసం బ్యాంకు లోన్ తీసుకుందని, ఇందు కోసం మైలాపూర్లోని ఇంటిని, ఆఫీసును 2010లో యూకో బ్యాంకులో తాకట్టు పెట్టారని పుష్పా తెలిపారు.

    2015లోనే ఆ సీరియల్ ఆగిపోయింది

    2015లోనే ఆ సీరియల్ ఆగిపోయింది

    సదరు సీరియల్ నిర్మాణం 2015లోనే ఆగిపోయిందని, అప్పటి వరకు బ్యాంకు రుణంపై అసలుతో పాటు కొంతమేర వడ్డీని చెల్లించామని తెలిపారు. మిగిలిన మొత్తాన్ని వన్ టైమ్ సెట్మెంటులో చెల్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, చర్చలు జరుగుతుండగానే బ్యాంకు నుండి వేలం ప్రకటన వచ్చిందన్నారు.

    ఆందోళన వద్దు...

    ఆందోళన వద్దు...

    అభిమానులు ఆందోళన చెందాల్ని అవసరం లేదని, బాలచందర్ ఆస్తులు వేలం వేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని పుష్పా తెలిపారు.

     బాలచందర్

    బాలచందర్

    బాలచందర్ 2014లో తన 84వ ఏట మరణించిన సంగతి తెలిసిందే. 100కుపైగా సినిమాలు, పలు సీరియల్స్ తీసిన ఆయన ప్రతిష్టాత్మక దాదా ఫాల్కే అవార్డుతో పాటు, పద్మశ్రీ, ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్, కలైమమని అవార్డులు సొంతం చేసుకున్నారు.

    English summary
    In a popular daily, UCO bank has given an advertisement that two properties of late director and producer K Balachander including his Kavithalayaa Production office and house have been put up for auction. Sources say that the production house had availed loan for their production ventures and final talks are on with the bank for one-time settlement.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X