For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సూపర్ స్టార్ విషయంలో కె.వి ఆనంద్,రాజమౌళి పోటీ?

  By Srikanya
  |

  చెన్నై : సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ని నెక్ట్స్ డైరక్ట్ చేసేది ఎవరనేది ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన్ని డైరక్ట్ చేసే అవకాసముందంటూ ఇద్దరు దర్శకుల పేర్లు వినపడుతున్నాయి. అవి కె.వి ఆనంద్,రాజమౌళి. తమిళ ఈగ చిత్రం చూసిన రజనీకాంత్ ...రాజమౌళి దర్శకత్వంలో చేయటానికి ఆసక్తి చూపారని సమాచారం. అలాగే మరో ప్రక్క శివాజి సినిమాకు ఛాయాగ్రాహకుడుగా పనిచేసిన కె.వి ఆనంద్ తన దర్శకత్వంలో రూపొందే తదుపరి చిత్రానికి రజనీ ని భావించుకునే కథను రెడీ చేసుకుంటున్నారు. వీళ్లద్దరిలో ఎవరకి రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిగా నడుస్తున్న టాపిక్.

  ఇక ఈ విషయమై రజనీకాంత్ కి చెందిన స్పోక్స్ మెన్ మాట్లాడుతూ...ఇప్పటివరకూ ఏ దర్సకుడు రజనీ తర్వాత చిత్రం చేస్తాడనేది డిసైడ్ చేయలేదు. మీరన్న రెండు పేర్లు కూడా పరిగణనలో ఉన్నాయి. ఇప్పుడు రజనీ చేస్తున్న యానిమేషన్ చిత్రం పూర్తయ్యాక మాత్రమే తర్వాత చిత్రం గురించి ఓ కంక్లూజన్ కి వస్తారు. ఆయన్ని కలిసి దర్శకులు కథలు చెప్తున్నారు. ఎవరి ప్రాజెక్టు ఓకే అవుతుందనేది చూడాలి. అలాగే బిజినెస్, ఆ దర్శకుడు గతంలో డైరక్ట్ చేసిన చిత్రాలు వంటివి పరిగణనలోకి తీసుకుని నిర్ణయిస్తారు అన్నారు.

  రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతున్న తమిళ సినిమా 'కోచ్చడయాన్‌'. దీపిక పదుకొనె హీరోయిన్. ఆది పినిశెట్టి ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. రజనీకాంత్‌ తనయురాలు సౌందర్య ఆర్‌.అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే లండన్‌లో విజువల్‌ ఎఫెక్ట్‌‌ వర్క్‌ పూర్తి చేశారు. తెలుగులో ఈ చిత్రాన్ని లక్ష్మి గణపతి ఫిలింస్‌ పతాకంపై బి.సుబ్రహ్మణ్యం అందిస్తున్నారు. తమిళ్‌, హిందీ, తెలుగు భాషలలో ఒకేసారి అంటే దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

  'కొచ్చాడయాన్' చిత్రంలో రజనీకాంత్..రణధీరన్‌ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్‌ మీనన్‌ కెమెరా వర్క్ అందిస్తున్నారు. ఈచిత్రంలో రజనీకాంత్ లాంగ్ హెయిర్ తో శివున్ని పోలి ఉంటాడని, కత్తులతో పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. తెలుగు వెర్షన్‌కి 'విక్రమ్‌ సింహా' అనే టైటిల్‌ని నిర్మాతలు పరిశీలిస్తున్నారనేది తాజా సమాచారం. శోభన, శరత్‌కుమార్‌, జాకీ ష్రాప్‌, నాజర్‌ ..ఇలా భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి రేకెత్తిన సంగతి తెలిసిందే. రజనీకాంత్‌ విభిన్న అవతారంలో కనిపించే పోస్టర్లు ఇప్పటికే అభిమానులు సహా ప్రేక్షకుల్లో వైబ్రేషన్‌ క్రియేట్‌ చేశాయి.

  English summary
  Buzz in the industry is — what will Superstar's next film be and who will direct it? It looks like many filmmakers have already pitched projects to the Superstar but he has still not made up his mind. The rumour is that the frontrunnners are either S S Rajamouli or K V Anand. In fact, Rajinikanth was all praise for the Naan Ee director after he saw the flick. A source says, "Rajini expressed interest after watching Naan Ee about working with Rajamouli but the director is yet to revert."
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X