Don't Miss!
- Finance
pmay: ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? ఇది మీ కోసమే..
- Sports
INDvsNZ : రెండో టీ20 పిచ్ రిపోర్ట్.. డేంజర్లో టీమిండియా రికార్డు!
- News
మా నాన్న జోలికి వస్తే సహించం - తమ్ముడంటే ప్రాణం: రాం చరణ్ వార్నింగ్..!!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
ఏన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు, నిర్మాతకు కబాలి డైరెక్టర్ షాక్!
#మీటూ ఉద్యమాన్ని సౌత్ ఇండస్ట్రీలో బలోపేతం చేసిన వారిలో సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి పేరు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ప్రముఖ తమిళ లిరిసిస్ట్ వైరముత్తు సెక్సువల్ వేధింపుల విషయం బయట పెట్టి ఆమె సంచలనం క్రియేట్ చేశారు. వైరముత్తు మీద ఆరోపణలు చేసినప్పటి నుంచి ఇండస్ట్రీలో ఆమెకు అవకాశాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్మయిని ఇబ్బంది పెట్టడం, విమర్శించడం వల్ల అలాంటి వేధింపులకు గురైన ఎవరూ కూడా నోరు విప్పకుండా కట్టడి చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇటీవల ఓ నిర్మాత ఏకంగా చిన్మయిని నీ అంతు చూస్తానంటూ బెదిరించాడు.

పారా
ఇటీవల తమిళ చిత్రం ‘పారా' ఆడియో వేడుకలో నిర్మాత కె రాజన్ మాట్లాడుతూ... వైరముత్తు పేరు పాడు చేసిన చిన్మయి అంతు చూస్తాను అంటూ బహిరంగంగా బెదిరించాడు. 50 మంది మహిళలను తీసుకొచ్చి దాడి చేయిస్తాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే ఇదే ఆడియో వేడుకలో రాజన్ మాటలను ఖండిస్తూ మరో గళం వినిపించింది.

చిన్మయి, శ్రీరెడ్డికి మద్దతుగా పా రంజిత్
ఇదే మూవీ ఆడియో వేడుకలో పాల్గొన్న కబాలి, కాలా దర్శకుడు పా రంజిత్ మాట్లాడుతూ... కె రాజన్ వ్యాఖ్యలను ఖండిస్తూ చిన్మయి, శ్రీరెడ్డి లాంటి వారికి మద్దతుగా మాట్లాడటం గమనార్హం. ఈ విషయం తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

ఏన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు
కె రాజన్ వ్యాఖ్యలను పా రంజిత్ ఖండిస్తూ... ‘‘మహిళలపై ఇలాంటి కామెంట్స్ చేయకూడదు. ఎన్నో ఏళ్లుగా ఈ ఇండస్ట్రీలో వారు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. దాన్ని మనం అంగీకరించాలి. శ్రీరెడ్డి, మరికొందరు ఈ విషయాలను రైజ్ చేశారు.. వారు చేస్తున్న ఆరోపణలపై మనం ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ సమస్యకు ఒక పరిష్కారం అనేది లభిస్తుంది'' అన్నారు.

కంప్లయింట్ చేస్తే ఇబ్బంది పెట్టడం సరికాదు
లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలు తమకు ఎదురైన సంఘటనల గురించి కంప్లయింట్ చేశారనే కారణంతో వారిని ఇబ్బంది పెట్టడం సరికాదు. ఇది సరైన విధానం కాదు, నేను దాన్ని ఖండిస్తున్నాను అని పా రంజిత్ తెలిపారు.

పా రంజిత్‌పై ప్రశంసలు
సభా ముఖంగా పా రంజిత్... ఒక నిర్మాత తప్పుడు ప్రవర్తనను ఖండిస్తూ ధైర్యంగా మాట్లాడటంపై ప్రశంసలు వెళ్లువెత్తుతున్నాయి. చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ కూడా ఆయన మాట్లాడిన తీరును ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.