»   »  కాలా చిత్రంలో నానా పాటేకర్.. రజనీతో నువ్వా నేనా?

కాలా చిత్రంలో నానా పాటేకర్.. రజనీతో నువ్వా నేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

దేవుడు శాసిస్తే రాజకీయాల్లోకి వస్తా అంటూ సూపర్‌స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు దక్షిణాదిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఓ వైపు రాజకీయ రంగ ప్రవేశంపై కసరత్తు చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీగా మారారు. రాజకీయ రంగ ప్రవేశంపై వ్యూహాలు రచిస్తూ.. కొందరు చేస్తున్న విమర్శలకు తనదైన శైలిలో సమాధానం చెప్తున్నారు. కాలా షూటింగ్ కోసం ముంబై వెళ్తున్నా. నటించడం నా ఉద్యోగం. దానిని నేను జాగ్రత్తగా చూసుకొంటున్నాను. మీడియా మీ పని మీరు సమర్థవంతంగా నిర్వహించడం అంటూ ఇటీవల ఓ మాట చెప్పారు. కాగా, కాలా చిత్రంలో ప్రముఖ నటుడు నానా పాటేకర్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.

ముంబైలో షూటింగ్..

ముంబైలో షూటింగ్..

దర్శకుడు పా రంజిత్‌ చిత్రం కాలా షూటింగ్ ఆదివారం ముంబైలో నిరాడంబరంగా ప్రారంభమైంది. ఈ షూటింగ్ సంబంధించిన స్టిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. గ్యాంగ్‌స్టర్ గెటప్‌లో రజనీకాంత్ అదరగొట్టేశాడు. నల్లటి డ్రస్‌, తెల్లటి గెడ్డం, నల్ల కళ్లజోడుతో చాలా చలాకీగా కనిపించాడు. ఈ చిత్రం గ్యాంగస్టర్ హాజీ మస్తాన్ జీవిత కథ ఆధారంగా తెరక్కెతున్నట్టు వార్తలు వస్తున్నాయి.


నానా పాటేకర్ కీలక పాత్ర..

నానా పాటేకర్ కీలక పాత్ర..

రాజకీయ రంగ ప్రవేశానికి ముందు వస్తున్న కాలా సినిమాలో ప్రముఖ నటుడు నానా పాటేకర్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఆదివారం ధృవీకరించింది. ఇప్పటికే ఈ చిత్రంలో బాలీవుడ్ నటి హ్యుమా ఖురేషి రజనీ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుల చేరికతో ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ వచ్చింది. ఈ చిత్రంలో సముద్రఖని, అంజలీ పాటిల్ నటిస్తున్నారు.


ఫస్ట్‌లుక్ విశేష స్పందన..

ఫస్ట్‌లుక్ విశేష స్పందన..

కాలా చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌ చిత్రాలకు విశేష స్పందన లభిస్తున్నది. ఇప్పటికే ఆ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఫస్ట్‌లుక్ పోస్టర్లు ఈ చిత్రంపై మరింత క్రేజ్‌ను పెంచాయి. రజనీ లుక్ చూడగానే అభిమానుల్లో ఉత్సాహం మొదలైంది.


నిర్మాతగా ధనుష్..

నిర్మాతగా ధనుష్..

ప్రముఖ నటుడు, రజనీ అల్లుడు ధనుష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న కాలా చిత్రం షూటింగ్ ఏకధాటిగా 40 రోజులు జరుపాలని ప్లాన్ చేశారు. ఈ చిత్రాన్ని 2018లో విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.English summary
The makers of superstar Rajinikanth’s upcoming Tamil film Kaala Karikaalan on Sunday confirmed that Bollywood actor Nana Patekar has been roped in to play a pivotal role in the movie. The principal shooting of the Pa Ranjith-directed film began on Sunday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu