For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  నిప్పురవ్వలా కాలా.. రజనీ.. హ్యాపీ బర్త్ డే.. కండక్టర్ టూ సూపర్‌స్టార్

  By Rajababu
  |
  కాలా లేటెస్ట్ పోస్టర్..!

  దక్షిణాది చిత్ర పరిశ్రమనే కాదు.. బాలీవుడ్‌ను కూడా దడదడలాడించే స్టార్ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రజనీకాంత్ మాత్రమే అని చెప్పుకోవాలి. ప్రాంతాలు, భాష, దేశాలకతీతంగా రజనీకి ఫ్యాన్స్ ఉండటం వెనుక ఆయన కఠోర శ్రమ, అంకితభావం. అలాంటి వన్ అండ్ ఓన్లీ సూపర్‌స్టార్ రజనీకాంత్ డిసెంబర్ 12న తన 67వ జన్మదినం జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా కాలా చిత్రంలోని రజనీ ఫొటోను అల్లుడు, హీరో ధనుష్ ట్వీట్ చేశారు.

   కాలా సెకండ్ లుక్

  కాలా సెకండ్ లుక్

  కాలా చిత్రానికి సంబంధించిన రెండో పోస్టర్ ఇది. గతంలో ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. నెరిసిన గడ్డం, జుట్టుతో కళ్లజోడు మాటున రజనీ తీక్షణమైన చూపు ఆకట్టుకొనే విధంగా ఉంది.

  ధనుష్ ట్వీట్

  సూపర్‌స్టార్ రజనీకాంత్ జన్మదినోత్సవం సందర్భంగా కాలా సినిమాలోని పోస్టర్‌ను రిలీజ్ చేస్తున్నాం అని ధనుష్ ట్వీట్ చేశారు. కాలా చిత్రానికి ధనుష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వండర్‌బార్ స్టూడియో బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

   శరవేగంగా కాలా చిత్రం

  శరవేగంగా కాలా చిత్రం

  కాలా చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకొంటున్నది. ముంబైలోని మురికివాడల్లో ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేశారు. ప్రస్తుతం చెన్నైలో వేసిన ప్రత్యేక సెట్‌లో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో నానాపాటేకర్, హ్యూమా ఖురేషి, పంకజ్ త్రిపాఠి, సముద్రఖని తదితరులు నటిస్తున్నారు.

   67 ఏళ్ల వయసులో దూసుకెళ్తున్న

  67 ఏళ్ల వయసులో దూసుకెళ్తున్న

  67 ఏళ్ల వయసులోనూ రజనీకాంత్ యువ హీరోలా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ నటించిన రోబో2.0 చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ మూడోవారంలో ఈ చిత్రం విడుదల కానున్నది.

   రోబో తర్వాతే కాలా

  రోబో తర్వాతే కాలా

  కాగా రోబో కంటే ముందే కాలా చిత్రం విడుదల కానున్నది అనే వార్తలను చిత్ర యూనిట్ కొట్టిపారేసింది. రోబో2.0 తర్వాతనే కాలా విడుదల అవుతుంది అని వారు పేర్కొన్నారు.

   కండక్టర్‌ టూ సూపర్‌స్టార్

  కండక్టర్‌ టూ సూపర్‌స్టార్

  రజనీకాంత్ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు.. కండక్టర్‌గా జీవన ప్రయాణం సాగించిన శివాజీరావు గైక్వాడ్.. ఆ తర్వాత నటుడిగా మారి రజనీకాంత్‌గా మారాడు. వరుస విజయాలతో దూసుకెళ్లి సూపర్‌స్టార్‌గా మారాడు.

   డైలాగ్ కింగ్ రజనీ

  డైలాగ్ కింగ్ రజనీ

  అది ఏ సినిమా కథైనా అందులో ఒదిగిపోవడం రజనీకి వెన్నతో పెట్టిన విద్య. క్యారెక్టర్‌కు అనుగుణంగా పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం రజనీ విలక్షణమైన శైలి. డైలాగ్ చెప్పడంలో ఆయనకు ఆయన సాటి. భాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే.. దేవుడు శాసిస్తాడు.. ఈ అరుణాచలం పాటిస్తాడు అని ఆయన చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్ ఇప్పటికీ ఫిదానే అవుతారు.

   సూపర్ స్టార్ స్టయిల్

  సూపర్ స్టార్ స్టయిల్

  సినిమాల్లో సిగరెట్ తాగే విధానం అభిమానులను విశేషంగా ఆకట్టుకొంటుంది. సిగరెట్‌ను గాలిలో ఎగురవేసి నోటిలో పెట్టుకోవడం రజనీ సిగ్నేచర్ స్టయిల్. ఈ స్టయిల్‌కే ఎందరో పడిపోయి అభిమానులుగా మారారు. ఇలా రజనీ మరిన్ని సంవత్సరాలు ఫ్యాన్స్‌ను ఆకట్టుకోవాలని కోరుకొంటూ సూపర్‌స్టార్‌కు తెలుగు ఫిల్మీబీట్ జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నది.

  English summary
  Dhanush released the second look of Rajinikanth in the upcoming film Kaala Kaarikalan, and Thalaivar’s swag is the highlight of this look. Before releasing the look, Dhanush wrote on Twitter, “Will be launching kaalaa 2 nd look tonight at 12 am for superstars birthday .. look forward to the swag of superstar.”
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more