»   »  రెండు కోట్ల బంపర్ ఆఫర్ వదిలేసిన కాజల్.. అలాంటి చిత్రం కావడంతో!

రెండు కోట్ల బంపర్ ఆఫర్ వదిలేసిన కాజల్.. అలాంటి చిత్రం కావడంతో!

Subscribe to Filmibeat Telugu

చందమామ కాజల్ అగర్వాల్ తనకు వచ్చిన ఓ క్రేజీ ఆఫర్ ని వదిలేసుకుందట. కాజల్ అగర్వాల్ ఇప్పటికి సౌత్ లో స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతోంది. కాజల్ చేసిన చిత్రాలన్నీ నటనతో పాటు గ్లామర్ ప్రాధాన్యత ఉన్నా చిత్రాలే.కాజల్ ప్రయోగాత్మక చిత్రాల్లో నటించింది చాలా తక్కువ. పైగా ఇంతవరకు సోలో హీరోయిన్ ఆ నటించలేదు. చంద్రముఖి వంటి చిత్రాన్ని తెరకెక్కించిన తమిళ దర్శకుడు పి వాసు ఇటీవల ఓ కథతో కాజల్ వద్దకు వెళ్లారట. భారీ స్థాయిలో ఆ చిత్రాన్ని తెరకెక్కించాలనేది ఆయన ప్లాన్.

కానీ వాసు ప్రతిపాదనని కాజల్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. రెండు కోట్ల పారితోషకం ఆఫర్ చేసినా కాజల్ ఒప్పుకోలేదట. వాసు చెప్పిన కథ సోలో హీరోయిన్ కథ కావడంతో కాజల్ ఆసక్తి చూపలేదట. ప్రస్తుతానికి తనకు సోలో హీరొయిన్ పాత్రలు చేసే ఉద్దేశం లేదని కాజల్ అగర్వాల్ దర్శకుడు వాసుకి వివరించినట్లు తెలుస్తోంది.

Kajal rejects solo heroine offer

సౌత్ లో నయనతార, అనుష్క వంటి హీరోయిన్లు అటు గ్లామర్ పరమైన పాత్రలు చేస్తూనే సోలో హీరోయిన్ గా రాణిస్తున్నారు. కాజల్ కు ఇప్పటికి మంచి గ్లామర్ రోల్స్ వస్తుండడంతో వాసు చిత్రాన్ని తిరస్కరించినట్లు తెలుస్తోంది.

English summary
Kajal rejects solo heroine offer. Even 2 cr remuneration also she rejects
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X