»   »  నటి కిడ్నాప్‌కు యత్నం...పోలీస్ వివాదం

నటి కిడ్నాప్‌కు యత్నం...పోలీస్ వివాదం

Posted By:
Subscribe to Filmibeat Telugu
Kalki about her Kidnap
చెన్నై : నటి కల్కిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌కు యత్నించారు. కల్కి 'నర్తకి' చిత్రం ద్వారా తెరకు పరిచయమయ్యారు. ఆమె ఓ హిజ్రా. దానితో పోలీసులు ఆమె నుంచి కంప్లైంట్ తీసుకోవాటనికి నిరాకరరించారు.

కల్కి మంచి నటనతో రాష్ట్రపతి నుంచి అవార్డు కూడా అందుకున్నారు. ప్రస్తుతం 'సహోదరి' అనే సంస్థ ద్వారా హిజ్రాలకు సేవలందిస్తున్నారు. ప్రస్తుతం పుదుచ్చేరి సమీపంలోని ఆరోవిల్‌లో నివసిస్తున్నారు.

రెండురోజుల క్రితం పుదుచ్చేరి నుంచి తన ద్విచక్రవాహనంలో ఇంటికి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కల్కిని కిడ్నాప్‌చేసి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆమె కేకలు విన్న స్థానికులు అక్కడ రావడంతో.. దుండుగులు బైక్‌లో పరారయ్యారు.

దీనిపై పుదుచ్చేరిలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈ ఘటనపై ఆరోవిల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశానని, అయితే తమ పరిథిలోని కేసు కాదంటూ పోలీసులు నమోదు చేయలేదని ఆరోపించారు. తదనంతరం మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేసేందుకు నిరాకరించారని చెప్పారు.

English summary

 
 Yesterday actress and transgender rights activist Kalki Subramaniam complinated police about her Kidnap. But Police are not intrested to take case.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu