ఆ ఘనత తెలుగువారికే,పూర్తి సహకారం: కమలహాసన్
చెన్నై: ఒకే భాష మాట్లాడేవారికి రెండు రాష్ట్రాలు, రెండు రాజధానులు ఉండటం గర్వకారణమని... ఆ ఘనత తెలుగు వారికే దక్కిందని ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్ అన్నారు.
ఈరోజు ఆయన చెన్నైలో మాట్లాడారు.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కాగా రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి కమల్ కు ఆహ్వానం అందినా...అనివార్య కారణాల వల్ల ఆయన వెళ్లలేకపోయారు.

అలాగే..నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన హీరో విశాల్ టీమ్ కు ఎలాంటి సహకారం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నామని కమల్‌హాసన్ తెలిపారు.
ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి తమ పూర్తి సహకారం ఉంటుందన్నారు. నడిగర్ సంఘంలో తమకు ఎలాంటి గౌరవ పదవులు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే నడిగర్ సంఘం పేరును అలాగే కొనసాగించాలని కమల్ హాసన్ సూచించారు.


Click it and Unblock the Notifications











