twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'విశ్వరూపం' : డిస్ట్రిబ్యూటర్స్ కి కమల్‌ వార్నింగ్

    By Srikanya
    |

    చెన్నై: " సాధారణ సినిమాగా విడుదలవుతుందని అనుకున్నా. నిజంగానే 'విశ్వరూపం' చేశారు. వారందరికీ కృతజ్ఞతలు. ఒక మాట మాత్రం చెప్పగలను. నేను న్యాయపరంగా వెళుతున్నా. దాన్ని అడ్డుకుంటే చట్ట విరుద్ధమే!' అంటూ కమల్ హాసన్ డిస్ట్కిబ్యూటర్స ్ ని ఉద్దేశించి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జనవరి 11న విడుదల కానున్న కమల్‌హాసన్‌ 'విశ్వరూపం' పేరుకు తగ్గట్టే ఆకారం దాల్చుతోంది. సినిమాను డీటీహెచ్‌లో విడుదల చేయనున్నట్లు కమల్‌ ప్రకటించారు. దీనిపై థియేటర్‌ యజమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేస్తే థియేటర్లు మూసేసుకుని వీధిన పడాల్సిందేనని అంటున్నారు. ఈ విషయమై కమల్ సీరియస్ గా స్పందించారు.

    అలాగే ఇది స్వతంత్ర భారతదేశం. నా ఇష్టం వచ్చిన పని చేసుకోవచ్చు. 'విశ్వరూపం' నా వస్తువు. దాన్ని న్యాయపరంగా ఎలాగైనా విడుదల చేసుకుంటా. అయితే థియేటర్‌ వారికి ఎలాంటి భయం లేదని ఇప్పటికే చాలాసార్లు చెప్పా. నాకు దాహం వేసింది. వెళుతూ ఉంటే నీటిగుంట కనిపించింది. దోసిటితో తాగా. దప్పిక తీరింది. ఆ నీటిని నాలాంటి వారు ఎవరైనా తాగొచ్చు. నీటిగుంట వద్దని చెప్పదు! ఇంత డబ్బు తీసుకుని కమల్‌ ఏం చేయబోతున్నాడు అని అందరూ అడుగుతున్నారు. నేను శివాజి అభిమానిని. ఆయనకు సొంతంగా థియేటర్‌ ఉంది. మరి నాకు..? అందుకే ఈ 'డీటీహెచ్‌ డబ్బు'తో థియేటర్‌ కడతా అన్నారు.

    కమల్‌ తన స్వీయ నిర్మాణంలో రూ.95 కోట్లు వెచ్చించి బ్రహ్మాండంగా 'విశ్వరూపం' తెరకెక్కించారు. పూజ, ఆండ్రియా హీరోయిన్స్ . ప్రారంభం నుంచే అన్ని చిత్రపరిశ్రమలు దీనివైపు ప్రత్యేక దృష్టి సారించాయి. అంతర్జాతీయ స్థాయిలో రూపొందించారని బాలచందర్‌, బాలుమహేంద్ర, భారతిరాజా వంటి దర్శకులు చెప్పడంతో దేశంలో ఆసక్తి రెట్టింపైంది. ఇలాంటి పరిస్థితుల్లో
    అమ్ముడయ్యాయి.

    థియేటర్‌ యజమానులకు ప్రత్యేకించి కమల్‌ పలుమార్లు'భయపడాల్సిన అవసరం లేద'ని భరోసా ఇచ్చారు. అంతేకాక ఒకవేళ ఫలితం తారుమారైతే తన ఆపన్న హస్తం ఉంటుందని కొందరు పంపిణీదారులకు చెప్పినట్లు సమాచారం. ఎన్ని చెప్పినా థియేటర్‌ యజమానుల సంఘం మాత్రం చిత్రాన్ని బహిష్కరించింది. ఇకపై కమల్‌కు సహకరించమని తేల్చిచెప్పింది. కమల్‌ తన దారి తాను చూసుకున్నాడు.

    కోయంబత్తూరు థియేటర్‌ యజమానుల సంఘం తరఫున సంఘ అధ్యక్షుడిగా కమల్‌కు మేం పూర్తి మద్దతిస్తున్నాం అంటున్నారు తిరుప్పూర్‌ కన్నన్‌. ఇప్పటి వరకు 30 థియేటర్లలో ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నాం. జనవరి ఒకటో తేదీ నుంచి థియేటర్ల పేర్లతో పాటు ప్రకటన విడుదల చేస్తాం. థియేటర్లకు జనం వస్తారనే నమ్మకం నాకుంది. మరో పదిమంది యజమానులు కూడా దీనిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారు అన్నారు.

    English summary
    Kamal Hassan, producer-director-actor told that Viswaroopam film’s cost is Rs 95 crore. He is releasing it himself and has not asked theatres to take it on minimum guarantee. He terms the protest from theatre owners as baseless. He says that if one shoots the film on camera from the TV it can be easily traced. Secondly the fear that it would be telecast in clubs ,bars and hotels like the cricket matches is baseless as commercial establishments do not come under this system.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X