»   » షాకిచ్చే విజువల్స్ : కమల్ 'మరుదనాయగం' ఫుల్ సాంగ్ ( వీడియో)

షాకిచ్చే విజువల్స్ : కమల్ 'మరుదనాయగం' ఫుల్ సాంగ్ ( వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కమల్ హాసన్ కలల సినిమా... 'మరుదనాయగం'..ఈ సినిమా మళ్లీ మొదలవుతుందా? అవుననే అంటున్నారు. అంతేకాదు దీనికోసం కమల్ సన్నాహాలు ప్రారంభించారు. ఎప్పుడో పదిహేనేళ్లక్రితం ఈ సినిమా మొదలై ఆగిపోయింది.

'ఈ కథకు కావల్సినంత బడ్జెట్‌ దొరకలేదు... అందుకే సినిమా ఆపేశా..' అని చాలాసార్లు కమల్‌ స్వయంగా చెప్పారు. ఇప్పుడీ సినిమా మళ్లీ మెదులు కాబోతోంది. అందుకు మొదటి స్టెప్ గా కమల్ ఆ సినిమాలో పాటను వదిలారు. ఆ పాటను మీరు ఇక్కడ చూడవచ్చు.

కమల్‌హాసన్‌ కలల సినిమా ఇది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్, డైరక్టర్, హీరో అన్నీ కమల్‌హాసనే. ఆ సినిమా ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా... 'ఎప్పుడో ఒకప్పుడు నా కలల చిత్రాన్ని తప్పకుండా తెరకెక్కిస్తా' అంటుండేవారు. ఇప్పుడా కల తీరబోతోంది.

తమిళ చిత్రసీమకు చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ 'మరుదనాయగం' నిర్మించడానికి ముందుకొచ్చిందని సమాచారం. దాంతో కమల్‌ ఈ సినిమాని మళ్లీ పట్టాలెక్కించడానికి సన్నద్ధం అవుతున్నాడని తెలుస్తోంది.

స్లైడ్ షోలో మిగతా డిటేల్స్

18 ఏళ్ళ క్రితం ...

18 ఏళ్ళ క్రితం ...

ఈ సినిమా ప్రారంభోత్సవం ఎలిజబెత్ రాణి చేతుల మీదుగా జరిగింది.

ఆగిపోయింది

ఆగిపోయింది

ఒక షెడ్యూల్‌ను కూడా జరుపుకున్న ఈ సినిమా షూటింగ్‌ అర్ధాంతరంగా ఆగిపోయింది.

లైకా గ్రూప్

లైకా గ్రూప్

ఇప్పుడు ఈ సినిమాను పునఃప్రారంభిద్దామని కమల్‌హాసనతో లైకా గ్రూప్‌ ఛైర్మన్ సుభాస్కరన్ అన్నారట.

ఎస్ అనండి చాలు

ఎస్ అనండి చాలు

‘‘ఒక్క ఫోన్ కాల్‌ చేసి ‘ఎస్‌' అని చెప్పండి చాలు ‘మరుదనాయగం' మొదలుపెట్టేద్దాం'' అని సుభాస్కరన్ అన్నట్టు సమాచారం.

దీని గురించి కమల్‌హాసన్ మాట్లాడుతూ...

దీని గురించి కమల్‌హాసన్ మాట్లాడుతూ...

‘‘‘మరుదనాయగం' అనేది అత్యంత భారీ వ్యయంతో, పనితో కూడుకున్న ప్రాజెక్ట్‌. ప్రీ ప్రొడక్షన్ వర్కే చాలా ఎక్కువగా ఉంటుంది.

అనుకోకూడదు

అనుకోకూడదు

ఏదో సుభాస్కరన్ నిర్మించడానికి సిద్ధంగా ఉన్నంత మాత్రాన అతని డబ్బుతో నేను ఏదో చేసేద్దాం అని అనుకోకూడదు. ఈ చిత్రానికి సరైన ప్రణాళిక, కార్యాచరణ చాలా అవసరం'' అని తెలిపారు.

రెండు సంస్ధలు..

రెండు సంస్ధలు..

రెండు భారీ చిత్ర నిర్మాణ సంస్థలు ఈ సినిమా నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాయనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది.

ట్వీట్ తో ..

ట్వీట్ తో ..

అయింగరన్ నిర్మాణ సంస్థ 'మరుదనాయగం' సినిమా పోస్టర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌చేయడంతో ఈ సినిమా తిరిగి సెట్స్‌పైకి వెళుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

బిజినెస్ సైతం

బిజినెస్ సైతం

ఈ సినిమా భారీ బడ్జెట్ తో చేసినా బిజినెస్ సైతం ఆ స్ధాయిలోనే అవుతుందనిచెప్తన్నారు.

బాహుబలి ..బలం

బాహుబలి ..బలం

బాహుబలి చిత్రం ఘన విజయం ఇచ్చిన ప్రేరణ ఈ ప్రాజెక్టు మళ్లీ బయిటకు తీయటానికి కారణం అని చెప్తున్నారు.

 మార్కెట్ పెరిగింది

మార్కెట్ పెరిగింది

బాహుబలి చిత్రం అంతర్జాతీయంగా చేసిన బిజినెస్ ని గమనించిన కమల్..అదే స్దాయిలో ఈ సినిమాని సైతం మార్కెట్ చేయవచ్చని భావిస్తున్నట్లు చెప్తున్నార.

ప్రపంచ మార్కెట్టే

ప్రపంచ మార్కెట్టే

ఈ సినిమాకు కేవలం ఇండియన్ మార్కెట్ సరిపోదని, ఎంతలా గ్లోబర్ మార్కెట్ చేయగలిగితే అంతలా లాభిస్తుందని అంచనాలు వేస్తున్నారు.

లెక్కలు తేలాకే

లెక్కలు తేలాకే

పూర్తిగా బడ్జెట్, ఎంత వరకూ బిజినెస్ అవుతుందనే లెక్కలు పూర్తి స్ధాయిలో తేలాకే ఈ ప్రాజెక్టుని ప్రారంబిస్తారని తెలుస్తోంది.

English summary
Watch and listen to the exclusive song from the movie Marudhanayagam. It is composed by music maestro Ilaiyaraaja. Directed Ravi K.Chandran, the movie features Kamal Haasan, Nasser, Sathyaraj and Pasupathy in the lead roles .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu