»   » ఈ సినిమా నా కోసం, నా దేశం కోసం: కమల్ హసన్

ఈ సినిమా నా కోసం, నా దేశం కోసం: కమల్ హసన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కమల్ హాసన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన 'విశ్వరూపం' చిత్రానికి సీక్వెల్‌గా 'విశ్వరూపం-2' రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తైనా విడుదల కావటం లేదు. అయితే ఇలా విడుదల ఆలస్యం కావటానికి కారణం నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ అంటూ కొన్నాళ్ళ కిందట చెప్పాడు కమల్ హసన్. సంచలనాలకు వేదికగా నిలిచిన 'విశ్వరూపం' సినిమాకు సీక్వెల్‌ వస్తుందని ఏడాదిగా ఊరిస్తున్నాడు .

వాయిదాపడుతూవస్తోంది

వాయిదాపడుతూవస్తోంది

ఇదిగో అదిగో అంటూనే ఈ సినిమా ఎప్పటికప్పుడు వాయిదాపడుతూవస్తోంది. విశ్వరూపం సినిమా విడుదల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత పెట్టిన ఆంక్షల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న కమల్.. చివరకు మీడియా ముందు కంటతడి కూడా పెట్టుకున్నాడు. ఇక సీక్వెల్‌ను దాదాపూ పూర్తి చేసినా.. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల సినిమాను నిలిపేస్తున్నట్లు కమల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆస్కార్ రవిచంద్రన్

ఆస్కార్ రవిచంద్రన్

" నాకు ఈ చిత్రం ఎందుకు విడుదల లేటవుతోందో తెలియదు. నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో నిర్ణయించుకోవాలి. అసలు ఈ చిత్రం విడుదల కాకుండా ఎందుకు ఆగుతుందో కారణం తెలుసుకోవాలి." "ఆ సినిమా రిలీజ్ అయ్యేదాకా నేను ఐడిల్ గా కూర్చోలేను. అందుకే నేను ఉత్తమ విలన్, పాప నాశమ్ చిత్రాలు చేసాను ." అన్నారు. అంటూ అప్పట్లో చెప్పాడు కమల్.

రెండో పార్ట్‌ మొత్తం ఇండియాలో

రెండో పార్ట్‌ మొత్తం ఇండియాలో

తొలిభాగం మొత్తం విదేశీ నేపథ్యంలో తీసిన కమల్‌హాసన్‌..రెండో పార్ట్‌ మొత్తం ఇండియాలో సాగుతుందని చెప్పడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే షూటింగ్‌ అయిపోయింది. పోస్ట్‌ప్రొడక్షన్‌ జరుగుతోందని ఏడాది నుంచి వార్తలొస్తున్నాయి కానీ సినిమా విడుదల సంగతే తేలడం లేదు.

విశ్వరూపం-2

విశ్వరూపం-2

విశ్వరూపం-2 విషయం మాట్లాడకుండా ఉత్తమ విలన్‌ పనుల్లో పడిపోయి చకచకా సినిమా పూర్తి చేసేసిన కమల్‌..ఆతర్వాత దృశ్యం రీమేక్‌ 'పాపనాశం షూటింగులోకి దిగిపోయాడు. అవీ పూర్తయ్యాక ఇప్పుడు శభాశ్ నాయుడు పనుల్లో బిజీ అయిపోయాడు. దీంతో విశ్వరూపం-2 గురించి అప్‌డేట్‌ లేక అభిమానులు నిరాశలో కూరుకుపోయారు.

 రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్

రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్

నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ నుంచి తాను విశ్వరూపం-2 నిర్మాణ హక్కుల్ని సొంతం చేసుకున్నానని ఆదివారం కమల్‌హాసన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని వెల్లడించారు. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ విశ్వరూపం-2 పూర్తి నిర్మాణ హక్కుల్ని తీసుకుంది.

ఇది నాకోసం, నాదేశం కోసం

ఇది నాకోసం, నాదేశం కోసం

ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం నా బాధ్యతగా భావించాను. రాజకీయ జోక్యాన్ని ఎదుర్కొన్నప్పటికి సినిమాను పూర్తి చేయాలని సంకల్పించాను. ఇది నాకోసం, నాదేశం కోసం అంటూ కమల్‌హాసన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు కమల్‌హాసన్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో రాహుల్‌బోస్, పూజా కుమార్, ఆండ్రియా, శేఖర్‌కపూర్, వహీదా రెహమాన్ తదితరులు ముఖ్యపాత్రల్ని పోషించారు. జిబ్రాన్ సంగీతాన్నందించారు.

English summary
"Happy to announce, Raajkamal Films International has taken over the responsibility of bringing Vishwaroopam2 within this calendar year 2017" Tweets Kamal hasan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu