twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమల్ సార్ మీరు గ్రేట్.. కరోనా బాధితుల కోసం సొంత ఇంటినే..

    |

    కరోనావైరస్ దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న సమయంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ తన వంతు బాధ్యతగా ఎన్నో రకాల సహాయం చేస్తున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారి తాను చేపట్టే కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. తాజాగా కరోనా బాధితుల కోసం కమల్ హాసన్ చాటిన మానవత్వం ఇంటర్నెట్ వినియోగదారులు విశేషంగా ఆకట్టుకొంటున్నది. కరోనా బాధితుల కోసం కమల్ చేస్తున్న కార్యక్రమాలు ఏమిటంటే..

    కరోనాపై కమల్ యుద్ధం

    కరోనాపై కమల్ యుద్ధం

    తమిళనాడులో కమల్ హాసన్ అటు సినీ రంగాన్ని, రాజకీయ వ్యవహారాలను చక్కదిద్దుకొంటూ స్వచ్ఛంద సేవలో కూడా మునిగిపోయారు. మక్కల్ నీది మైయమ్ అనే పార్టీతో ప్రజలను చైతన్య పరుస్తూనే తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనాపై యుద్దాన్ని ప్రకటించారు.

    ప్రధానికి బహిరంగ లేఖ

    ప్రధానికి బహిరంగ లేఖ

    కరోనాతో ఇబ్బంది పడుతున్న సగటు ప్రజలకు ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రధాని మోదీకి కమల్ హాసన్ లేఖ రాయడం సంచనలం రేపింది. ఇంటి నుంచి పనిచేయలేని రైతులకు, మత్స్యకారులకు ఆర్థిక సహాయం అందించండి అంటూ ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. కమల్ లేఖపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు.

     పేద కార్మికులకు అండగా

    పేద కార్మికులకు అండగా

    ఇంతకు ముందు, కరోనా లాక్‌డౌన్‌తో బాధపడుతున్న సామాన్య ప్రజలకు ఆదుకొనేందుకు కమల్ హాసన్ ముందుకు వచ్చారు. కరోనాతో ఉపాధి కోల్పోయిన రోజువారి వేతన కార్మికులు, పేద కార్మికులకు ఆహారం, అత్యవసర వస్తువులను అందించేందుకు రెడీగా ఉన్నాని ట్విట్టర్‌లో వెల్లడించారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే తాను ముందుకు వచ్చానని చెప్పారు.

    ఇంటినే తాత్కాలిక హాస్పిటల్‌గా

    ఇంటినే తాత్కాలిక హాస్పిటల్‌గా

    తాజాగా కరోనా బాధితులకు అండగా నిలుచేందుకు కమల్ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. తన ఇంటినే తాత్కాలిక హాస్పిటల్‌గా మార్చి నెటిజన్ల మనసు దోచుకొన్నాడు. తాజా నిర్ణయం నేపథ్యంలో కమల్‌పై పలువురు ప్రశంసలు గుప్పిస్తున్నారు. కమల్‌ను స్ఫూర్తిగా తీసుకొని యాక్టర్లు ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు. మానవత్వం చాటిన కమల్‌ను సార్ మీరు గ్రేట్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

    Recommended Video

    Vakeel Saab : Shruti Haasan To Pair Up With Pawan Kalyan In Vakeel Saab?
    ఇండియన్ 2 చిత్రంలో

    ఇండియన్ 2 చిత్రంలో

    ఇక కెరీర్ పరంగా, దర్శకుడు శంకర్ తెరకెక్కించే ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం వస్తున్నది. ఇటీవల జరిగిన ప్రమాదం కారణంగా ఇండియన్ 2 చిత్ర షూటింగ్ ఆగిపోయంది. ఆ తర్వాత కరోనా పలు చిత్రాల షూటింగ్‌లకు అడ్డు తగిలిన విషయం తెలిసిందే.

    English summary
    Actor and Politician Kamal Haasan shows humanity amid Coronavirus scare. He is willing to convert his residence to a temporary hospital for corona victims.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X