twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమల్ హాసన్‌కు బెదిరింపు కాల్స్... కంప్లైంట్

    By Srikanya
    |

    చెన్నై: తన కొత్త చిత్రం 'విశ్వరూపం'ను డీటీహెచ్‌లో ప్రసారాలు చేస్తే చంపేస్తామంటూ కొందరు తనకు బెదిరింపు ఫోన్లు చేస్తున్నారని నటుడు కమల్ హాసన్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఆదివారం ఆయన చెన్నైలోని అడిషనల్ డీజీపీ కార్యాలయంలో ఏడీజీపీ రాజేంద్రన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆ సినిమా పైరసీ సీడీలు తయారుచేస్తామని, సినిమా ప్రసార సమయంలో విద్యుత్ ప్రసారాలు లేకుండా చేస్తామని తనను బెదిరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సినిమా విడుదలకు ముందు రోజే సినిమాను డీటీహెచ్ ద్వారా ప్రసారం చేయాలని ఆయన నిర్ణయించిన సంగతి తెలిసిందే.

    కమల్‌ హాసన్‌ కొత్త సినిమా 'విశ్వరూపం' విడుదల విషయంలో ఏర్పడిన వివాదం సమసిపోలేదు. ధియేటర్లలో విడుదలకుముందుగానే డీటీహెచ్‌ ద్వారా విడుదల చేసి తీరానని కమల్‌ మరోసారి తేల్చిచెప్పారు. ఈ మేరకు చెన్నైలో ఒక ప్రకటన విడుదల చేశారు. డీటీహెచ్‌ విడుదల విధానం మంచి సినిమాలు ఎక్కువమందికి చేరడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ విధానం, ధియేటర్‌లకు వచ్చేసమయంలేని ఉన్నతస్థాయివర్గాలకోసమని తెలిపారు.

    "సాధారణ సినిమాగా విడుదలవుతుందని అనుకున్నా. నిజంగానే 'విశ్వరూపం' చేశారు. వారందరికీ కృతజ్ఞతలు. ఒక మాట మాత్రం చెప్పగలను. నేను న్యాయపరంగా వెళుతున్నా. దాన్ని అడ్డుకుంటే చట్ట విరుద్ధమే!' అంటూ కమల్ హాసన్ డిస్ట్కిబ్యూటర్స ని ఉద్దేశించి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జనవరి 11న విడుదల కానున్న కమల్‌ హాసన్‌ 'విశ్వరూపం' పేరుకు తగ్గట్టే ఆకారం దాల్చుతోంది. సినిమాను డీటీహెచ్‌లో విడుదల చేయనున్నట్లు కమల్‌ ప్రకటించారు. దీనిపై థియేటర్‌ యజమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేస్తే థియేటర్లు మూసేసుకుని వీధిన పడాల్సిందేనని అంటున్నారు. ఈ విషయమై కమల్ సీరియస్ గా స్పందించారు.

    అలాగే ఇది స్వతంత్ర భారతదేశం. నా ఇష్టం వచ్చిన పని చేసుకోవచ్చు. 'విశ్వరూపం' నా వస్తువు. దాన్ని న్యాయపరంగా ఎలాగైనా విడుదల చేసుకుంటా. అయితే థియేటర్‌ వారికి ఎలాంటి భయం లేదని ఇప్పటికే చాలాసార్లు చెప్పా. నాకు దాహం వేసింది. వెళుతూ ఉంటే నీటిగుంట కనిపించింది. దోసిటితో తాగా. దప్పిక తీరింది. ఆ నీటిని నాలాంటి వారు ఎవరైనా తాగొచ్చు. నీటిగుంట వద్దని చెప్పదు! ఇంత డబ్బు తీసుకుని కమల్‌ ఏం చేయబోతున్నాడు అని అందరూ అడుగుతున్నారు. నేను శివాజి అభిమానిని. ఆయనకు సొంతంగా థియేటర్‌ ఉంది. మరి నాకు..? అందుకే ఈ 'డీటీహెచ్‌ డబ్బు'తో థియేటర్‌ కడతా అన్నారు.

    English summary
    Actor Kamal Hassan on Sunday lodged a police complaint stating that he had been threatened against releasing the movie ‘Viswaroopam’ in DTH format. Kamal lodged a complaint with Additional director general of police (Law and Order) T K Rajendran. He alleged that calls threatening to circulate pirated DVDs and cut power supply to theatres screening the movie were made to him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X