»   » 'రోబో' కి మొదట హీరో గా రజనీని అనుకోలేదు...శంకర్

'రోబో' కి మొదట హీరో గా రజనీని అనుకోలేదు...శంకర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'రోబో' సినిమాని మొదట కమల్‌ హాసన్‌ హీరోగా, ప్రీతి జింటా హీరోయిన్ గా అయితే బాగుంటుందని భావించాను. అయితే ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. అలా వాయిదాపడింది. తరవాత షారుఖ్ ‌ఖాన్ ‌తో చేసేందుకు రంగం సిద్ధం చేసుకొన్నాను. కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఇప్పుడు రజనీకాంత్‌ తో చేయడంతో నా కల నెరవేరింది. రజనీకాంత్‌ లాంటి స్టార్‌తో ఇంత భారీ చిత్రం చేయడం గొప్ప ఎక్సపీరియన్స్ అన్నారు దర్శకుడు శంకర్.

అలాగే 'రోబో'లో విలన్ పాత్రలో అమితాబ్‌ బచ్చన్ ‌ను నటింపజేయాలనుకొన్నాను..ఈ మేరకు బిగ్‌ బిని కలిసి కథ వినిపించాను. ఆయనకీ అంతా నచ్చింది. అయితే అమితాబ్ ‌ని విలన్ పాత్రలో చూపిస్తే ప్రేక్షకులు ఏ విధంగా తీసుకొంటారో అనే సందేహంతో నిర్ణయం మార్చుకొన్నాను. ఆ స్థానంలో డానీ డెంగ్జోన్పాని ఎంచుకొన్నాను అంటున్నారు శంకర్. ఇక 'రోబో' ఆలోచన ఇప్పటిది కాదు. పన్నెండేళ్ల కిందటే ఈ కథకి బీజంపడింది. ఇలాంటి విశేషాలతో శంకర్‌ పుస్తకం ఓ పుస్తకం రాసి రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu