twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను ఒరిజినల్‌ కాను: కమల్‌హాసన్‌ ఇంటర్వూ (ఫొటో ఫీచర్)

    By Srikanya
    |

    చెన్నై: . అసలు నేనే ఒరిజినల్‌ కాదు. మా అమ్మానాన్న ఛాయలున్న రూపాన్ని. అలాంటప్పుడు.. నేనెలా ఒరిజినల్‌ అవుతాను అంటున్నారు కమల్ హాసన్. ఇతరులను అనుకరించే నటులు ఓ రకం. ఎవరి అనుకరణకూ అంతుచిక్కని నటులు మరో రకం. అలా రెండో రకానికి చెందిన 'విశ్వనటుడే' కమల్‌హాసన్‌..!

    'సినిమాల విషయంలో సెన్సార్‌ బోర్డు తన పరిధికి మించి జోక్యం చేసుకుంటోంద'ని ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ విమర్శించారు. 'ఉత్తమ విలన్‌'కు సంబంధించి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ''సినిమా వాళ్లు ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పేందుకు సెన్సారు బోర్డు ప్రయత్నిస్తోంది. దీన్ని నేను సమ్మతించను'' అని కమల్‌ అన్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    తన స్నేహితుడు రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో నటించిన 'ఉత్తమ విలన్‌' ఈ నెల 10వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్ర విశేషాలను, కెరీర్‌ ప్రత్యేకతలను కమల్‌ మీడియాతో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

    స్లైడ్ షో లో ...కమల్ ప్రెస్ మీట్ ఫొటోలతో ఇంటర్వూ..

    సెన్సార్ బోర్డ్

    సెన్సార్ బోర్డ్

    ''ఓ కళాకారుడిగా ప్రజలకు సందేశాన్ని ఇవ్వడం నా బాధ్యత. అయితే దీనికి అడ్డుపడుతున్న వారి గురించి కూడా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నా'' అంటూ పరోక్షంగా సెన్సార్‌ బోర్డుపై విమర్శలు గుప్పించారు.

    కమల్ అంసతృప్తి

    కమల్ అంసతృప్తి


    పరాజయం చెందిన సినిమాల విషయంలో తమ డబ్బు వెనక్కు ఇవ్వాలంటూ పంపిణీదారులు డిమాండ్‌ చేస్తున్న తీరుపైనా కమల్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

    రజనీకాంత్ ఆమోదయోగ్యం

    రజనీకాంత్ ఆమోదయోగ్యం

    ''రజినీకాంత్‌ తన సినిమా పంపిణీదారులకు పరిహారం చెల్లించి ఇలాంటి సంప్రదాయానికి తెరతీసినా ఇది ఆమోదయోగ్యం కాదు'' అని కమల్‌ అభిప్రాయపడ్డారు.

    కేబీ.. నా పాఠశాల..

    కేబీ.. నా పాఠశాల..

    చిత్ర పరిశ్రమలో నేను ఇంత స్థాయికి ఎదగడానికి ప్రధాన కారణం గురువర్యులు కె.బాలచందర్‌. ఆయన ఇచ్చిన జీవితమే ఇది. నా మార్గదర్శి కూడా. యాధృశ్ఛికం ఏంటంటే.. 'ఉత్తమ విలన్‌'లోనూ ఆయన మార్గదర్శిగానే నటించారు. అందరూ సమానమనే తత్వాన్ని ఆయన నుంచే నేర్చుకున్నా.

    నేనూ మోసా

    నేనూ మోసా

    హీరో కెమెరాలను మోసే సన్నివేశాలు ఆయన చిత్రీకరణ స్పాట్‌లోనే కనిపిస్తాయి. 'ఏక్‌దుజే కేలియే' వరకు నాకు అలాంటి సందర్భాలే దర్శనం ఇచ్చాయి. నేను కూడా మోసా. మరి రజనీ చేశారో లేదో అడిగి చెప్పాలి.

    పాఠాశాలగా...

    పాఠాశాలగా...

    ఆయనతో పనిచేసిన సినిమాలన్నీ ప్రభంజనాలే. ఎన్నో గొప్ప విషయాలు నేర్పాయి. నేర్చుకోవడానికి పాఠశాలగా నిలిచాయి. కొన్ని సన్నివేశాలను తెరకెక్కించేటప్పుడు.. 'సార్‌ దీన్ని వేరేలా తీద్దామ'ని చెబుతా.. 'అరే నువ్వు చెడగొట్టకు.. టెక్నాలజీ పేరు చెప్పి సాగదీయకు. సింపుల్‌గానే ఉండనివ్వు' అని చెప్పేవారే తప్ప.. బాగలేదని ఎప్పుడూ అనరూ.

    ఆయనే కారణం

    ఆయనే కారణం

    'నువ్వు నటుడివా.. ఇంజినీరువా..' అని నన్ను చూసి అడిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం నాకున్న సాంకేతిక పరిజ్ఞానానికి కూడా బాలచందరే కారణమని చెప్పగలను.
    రెండు పాత్రలనూ కలిపే

    రెండు పాత్రలనూ కలిపే

    ఉత్తమవిలన్ లో నేను రెండు భిన్నమైన కాలాలకు చెందిన వ్యక్తులుగా నటించా. ఈ రెండింటినీ కలిపే పాత్రలో కేబీ నటించారు.

    టైటిల్ నాదే

    టైటిల్ నాదే

    'దేవర్‌ మగన్‌' తర్వాత శివాజీ గణేశన్‌, బాలచందర్‌, నేను కలిసి ఓ సినిమాలో నటించాలని నిర్ణయించుకున్నాం. అందుకు టైటిల్‌గా 'పితామగన్‌' అని రిజిస్ట్రర్‌ చేశాం. కానీ ఆగిపోయింది. ఆ శీర్షికనే తర్వాత దర్శకుడు బాలా తీసుకున్నారు.

    ఆశయాన్ని నెరవేర్చారు

    ఆశయాన్ని నెరవేర్చారు

    కానీ కేబీ పోతూపోతూ నా ఆశయాన్ని నెరవేర్చి నా సినిమాలో నటించారనే అనుకుంటున్నా. ఉత్తమవిలన్ లో కె.విశ్వనాథ్‌ పాత్ర కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఇద్దరూ పరస్పరం పోటీపడే పాత్రల్లో నటించారు.

    సమష్టి కృషే 'ఉత్తమ విలన్‌'

    సమష్టి కృషే 'ఉత్తమ విలన్‌'

    ఇది ఎలాంటి కథ.. అని అందరూ అడుగుతున్నారు. 'ఉత్తమ విలన్‌' కోసం నేనేమీ అద్భుతాలు సృష్టించలేదు. నేను చూసిన, గతంలో నా సినిమాలో ఉన్న కొన్ని అంశాలే ఈ చిత్ర కథ.

    పేరులో విశ్వాసం లేదు

    పేరులో విశ్వాసం లేదు

    నాకంటూ ఒకశైలి ఉందంటే.. దాన్ని నేను నమ్మను. అంతెందుకు నన్ను 'కమల్‌' అని పిలిస్తేనే ఇప్పటికీ కొత్తగానే అనిపిస్తుంది. అది నాకు పెట్టిన పేరుకదా అనుకుంటా. ఇప్పుడు 'ఉలగనాయగన్‌' (విశ్వనటుడు) అంటున్నారు. 'ఓ.. ఇదో కొత్త పేరేమో' అని అనుకుంటున్నా. అంతే తప్ప పేరులో కూడా నాకు విశ్వాసం లేదు.

    కొత్త లుక్ లో

    కొత్త లుక్ లో

    ఇది కమల్‌ చిత్రం మాత్రమే కాదు.. అందరి కృషి ఇందులో కనిపిస్తుంది. వూశ్వరి, ఆండ్రియా, పూజాకుమార్‌, పార్వతిమేనన్‌.. కొత్తలుక్‌లో కనిపిస్తారు. ఇక నాజర్‌, ఎం.ఎస్‌.భాస్కర్‌, జయరామ్‌ పాత్ర ప్రేక్షకులను రంజింపజేస్తాయి.

    జోడియే

    జోడియే

    ఇందులో అందరూ నాకు జోడీయే. ప్రత్యేకించి హీరోయిన్ అని ఎవర్నీ చెప్పలేను. ఇందులో నెత్తురోడే సన్నివేశాలేవీ లేవు. అలాంటిది ఉండకూడదని ప్రారంభంలోనే నిర్ణయం తీసుకున్నాం.

    సమస్యలు ఎక్కువే..

    సమస్యలు ఎక్కువే..

    అదేంటో కానీ.. నా సినిమాలకు పనిగట్టుకుని కొత్త సమస్యలు సృష్టిస్తుంటారు. 'ముంబయి ఎక్స్‌ప్రెస్‌' పేరును మార్చమన్నారు. ఆ తర్వాత 'దశావతారం' కథ నాదని ఒకరొచ్చారు. అసలు అతన్ని ఎవరు పంపారో కూడా నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో కూడా తెలుసు.

    పాపనాశం కు కూడా

    పాపనాశం కు కూడా

    'విశ్వరూపం'ను కూడా అలాగే చేశారు. ఇప్పుడు 'పాపనాశం' సినిమాకు కూడా పలు అడ్డంకులు ఎదురయ్యాయి. ఇవన్నీ సహజమే అనుకుని వెళ్తున్నా.

    పీకేలో నటించడం లేదు

    పీకేలో నటించడం లేదు

    అమీర్‌ఖాన్‌ నటించిన 'పీకే' చిత్రం రీమేక్‌ చేస్తున్నారా..? అని అడుగుతున్నారు. లేదు అన్నదే అందుకు సమాధానం.

    నిర్మాతే చెప్పాలి

    నిర్మాతే చెప్పాలి

    నటించడమే నా కర్తవ్యం. కానీ కొన్ని సినిమాలు సకాలంలో విడుదల కాలేదంటే.. అందుకు నిర్మాతలే సమాధానం చెప్పాలి. నిజానికి అలాంటి సమస్యలకు కారణాలేంటో కూడా నాకు తెలియట్లేదు. త్వరలో మీరు 'ఉత్తమ విలన్‌'ను చూడబోతున్నారు. ఆ తర్వాత పాపనాశం', అనంతరం 'విశ్వరూపం 2' వస్తుంది.

    'మరుదనాయగం' మళ్లీ వస్తుంది

    'మరుదనాయగం' మళ్లీ వస్తుంది


    'మరుదనాయగం' చిత్రం వీలైనంత త్వరలో మళ్లీ తెరపైకి వస్తుంది. నా స్నేహితులు కూడా చాలా మంది ఉత్సాహపడుతున్నారు. వారికి అది ఎలాంటి సినిమానో వివరిస్తున్నా. ఇదో ప్రపంచ సినిమా. ఏ భాషకైనా అన్వయించుకోవచ్చు.

    సెన్సార్ బోర్డ్ తీరు

    సెన్సార్ బోర్డ్ తీరు

    సెన్సార్‌ బోర్డు తీరు ప్రస్తుతం బాధాకరంగా అనిపిస్తోంది. మాట్లాడే స్వేచ్చపైన, అభిప్రాయ వ్యక్తీకరణపై వారు పాదం మోపడం సమంజసం కాదు.

    ఓ కళాకారుడిని

    ఓ కళాకారుడిని

    సినిమాలో ఏం మాట్లాడాలన్నా.. ముందు వారికి చెప్పి.. అనుమతి తీసుకున్నాకే సినిమాలో పెట్టే పరిస్థితి వస్తుందేమో. అయినా వారిని ఎదుర్కోవడానికి నువ్వెవరు?.. అని అడగొచ్చు. నేను ఓ కళాకారుడిని.

    English summary
    Kamal Hassan-starrer Uttama Villain will open worldwide on April 10, a few days before the Tamil New Year, taking advantage of the long weekend. Also, with the school examinations out of the way, many, many footfalls can be expected in theatres screening the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X