twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఖరారు: సీనియర్ డైరక్టర్ తో కమల్ నెక్ట్స్

    By Srikanya
    |

    చెన్నై : చీకటి రాజ్యం అంటూ త్వరలో పలకరించబోతున్న లోక నాయకుడు కమలహాసన్ ఇంకో సినిమాకు అప్పుడే రంగం సిద్దం చేసుకున్నాడు. చీకటి రాజ్యం చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో నిర్మిస్తున్న కమల్ ఈ సారి తమిళం, మలయాళం భాషల్లో రూపొందనున్న చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ మలయాళ దర్శకుడు రాజీవ్‌కుమార్ దర్శకత్వం వహించనున్నారు.

    ఈయన ఇంతకు ముందు కమలహాసన్‌తో చాణక్యన్ అనే మలయాళ చిత్రాన్ని తెరకెక్కించారు. సుమారు 26 ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు కమల్‌తో చిత్రం చేయనున్నారు. దీనికి కథ సిద్ధమయ్యింది. ఇతర తారాగణం, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కానుందని కోలీవుడ్ టాక్.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    కమల్ ఇటీవల తన చిత్రాల వేగాన్ని పెంచిన విషయం తెలిసిందే. చిత్ర నిర్మాణాలను అతితక్కువ రోజుల్లో పూర్తిచేస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. దృశ్యం చిత్ర షూటింగ్‌ను 37 రోజుల్లో పూర్తి చేసిన కమల్ తాజా ద్విభాషా చిత్రం తూంగావనంను 60 రోజుల్లో (ఒక్కో భాషకు 30 రోజుల చొప్పున) ముగించారు. తూంగావనం చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని కమలహాసన్ దీపావళి సందర్భంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

    Kamal's next film by Malayalam director Rajeev Kumar ...

    అలాగే... చీకటి రాజ్యం విషయానికి వస్తే...

    కమల్ హాసన్ హీరోగా రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై... కమల్ సోదరుడు చంద్రహసన్ నిర్మిస్తున్న చిత్రం చీకటిరాజ్యం. కమల్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న రాజేశ్.ఎమ్.సెల్వ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. గత కొద్ది రోజులుగా ఈ చిత్రం Sleepless Night (2011) అనే ఫ్రెంచ్ చిత్రం ఆధారంగా రూపొందుతోందని చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

    గతంలోనూ కమల్ చిత్రాలు రకరకాల పరభాషా చిత్రాల నుంచి ప్రేరణ పొందినవి కావటంతో ఇదే నిజమే కావచ్చుననే అంటున్నారు. అయితే ఇవన్నీ వట్టి వదంతులేనని, తాను ఓ నవల రైట్స్ తీసుకుని తెరకెక్కించానని దర్శకుడు చెప్తున్నారు.

    రాజేశ్.ఎమ్.సెల్వ మాట్లవాడుతూ...ఈ సినిమా గురించి బయట సాగుతున్న ప్రచారం మాకే కొత్తగా ఉంది. ఇది ఓ ఫ్రెం నవల ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నాం. ఇందుకోసం సంబంధిత రచయిత వద్ద హక్కులు పొంది.. అధికారికంగా సినిమాను తెరకెక్కిస్తున్నాం. అంతలోపు ఇది ఫలానా సినిమా రీమేక్‌, మరో సినిమా సన్నివేశాలు ఆధారంగా తీస్తున్నారు.. వంటి వదంతులన్నీ పొక్కాయి అని అన్నారు.

    Kamal's next film by Malayalam director Rajeev Kumar ...

    'తూంగావనం' ఫ్యామిలీ థ్రిల్లర్‌ డ్రామా. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. తొలిఫ్రేములోనే అసలైన కథ ఆరంభమవుతుంది. ఆ తదుపరి సన్నివేశంలో ఏమవుతుందోనన్న ఉత్కంఠ ప్రతి ప్రేక్షకుడికి కలుగుతుంది. మేకింగ్‌ చాలా కొత్తగా ఉండాలని సాంకేతికంగా పలు అంశాలను పాటించాం. కమల్‌సార్‌ స్త్టెల్‌, లుక్‌ అంతా చాలా కొత్తగా ఉంటుంది. ఒకరోజు ఉదయం నుంచి మరుసటిరోజు ఉదయం వరకు జరిగే కథ ఇది. 60 శాతం సన్నివేశాలను రాత్రివేళల్లో చిత్రీకరించాం.

    కమల్‌ తాను ఓ పెద్ద హీరో అన్న హంగూ ఆర్భాటాలను సెట్‌లో ఏమాత్రం ప్రదర్శించరు. పదిమంది కలసి నటించే సన్నివేశంలో ఓ చిన్న ఆర్టిస్టు తప్పు చేసినా.. రీటేక్‌కు వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు ఎందుకు అన్న ప్రశ్న కూడా లేకుండా మళ్లీ నటిస్తారు కమల్‌. ఎన్ని టేకులైనా సరే విసుగు చెందరు. సినిమా బాగా రావాలన్నదే ఆయన తపన. ఏదైనా ఓ విషయం చేయలేమని మేం భావిస్తే.. మా కళ్లెదుటే దాన్ని చేసి చూపుతారు. 'విశ్వరూపం', 'ఉత్తమ విలన్‌' చిత్రాల్లో ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. చిత్రయూనిట్‌లో ప్రతిరోజూ అందరూ ఆశ్చర్యంగా చూసే ఏకైక వ్యక్తి కమల్‌ మాత్రమే.

    త్రిష సహా ఇందులో నటించే ప్రతి ఒక్కరూ కొత్తగా కనిపిస్తారు. 'మన్మదన్‌ అంబు'లో కూడా త్రిషను కొత్తగా మార్చాం. ఆ తర్వాత కమల్‌ హీరోగా 'మర్మయోగి' చేద్దామనుకున్నాం. అందులో త్రిషనే హీరోయిన్ గా అనుకున్నాం. అప్పటి నుంచే ఆమెతో పరిచయం ఉంది. 'తూంగావనం' చిత్రానికి నేనే దర్శకుడిని అని చెప్పగానే ఆమె చాలా సంతోషించారు. ఇదివరకు ఆమె చేయని పాత్ర పోషించారు. ఇది ఆమెకు 50వ చిత్రం.

    గిల్స్‌ కాన్సీల్‌ అనే స్టంట్‌ దర్శకుడు ఈ సినిమాలో పోరాట సన్నివేశాలను సమకూర్చారు. మన స్టంట్‌మాస్టర్‌ రమేష్‌ కూడా పనిచేశారు. ఈ సినిమాలోని ప్రతి ఫైట్‌లోనూ వాస్తవికత కనిపిస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా వదలకుండా ఇందులో తీసుకొచ్చాం. గాల్లో తేలుతూ పోరాడే సన్నివేశాలు ఉండవు. ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయి.

    ఇందులో ప్రకాశ్‌రాజ్‌ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. కిశోర్‌, ఆషాశరత్‌, సంపత్‌రాజ్‌, యూగిసేతు, మధుశాలిని, ఉమారియాజ్‌, సంతానభారతి, జగన్‌.. ఇలా చాలా మంది నటిస్తున్నారు. ఇందులో ప్రతి ఒక్కరూ కీలకమైనవారే. ఇలా వచ్చి అలా వెళ్లిపోయే పాత్రలుండవు. ప్రేక్షకుడిని ప్రభావితం చేసేలా పాత్రలను రూపకల్పన చేశాం.

    'విశ్వరూపం', 'ఉత్తమవిలన్‌' చిత్రాల సౌండ్‌ మిక్సింగ్‌ చేసిన కునాల్‌ రాజన్‌.. ఈ సినిమాకు కూడా పనిచేస్తున్నారు. అందువల్లే సినిమాను అమెరికాకు పంపాం. సంగీత దర్శకుడు జిబ్రాన్‌కు సినిమాలో పెద్ద భాగస్వామ్యం ఉంది. కెమెరామెన్‌ షాన్‌వర్గీస్‌, సుహాలు సినిమాకు అందాన్ని తీసుకొచ్చారు.

    ఈ చిత్రంలో కమల్ నార్కొటిక్స్ సెంట్రల్ బ్యూరో వింగ్ కు చెందిన ఆఫీసర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ నార్కోటిక్స్ ప్రపంచంలోని కొందరు వ్యక్తులు తన కుమారుడుని కిడ్నాప్ చేస్తే ఎలా వారిని ఎదుర్కొని, వెనక్కి తెచ్చుకున్నాడనే కథాంశంతో నడుస్తుందని చెప్తున్నారు.

    కమల్ విలక్షణ శైలికి అనుగుణంగా అద్భతంగా ఉందీ ట్రైలర్. సస్పెన్స్‌తో కూడిన ఓ థ్రిల్లర్‌లా ఈ మూవీ ఉండనున్నట్లు ట్రైలర్‌ను చూస్తే అర్ధమవుతుంది. తమిళంలో తూంగవనమ్‌గా వస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ అద్భత హావభావాలు పలికించారు.

    ప్రకాశ్ రాజ్, త్రిషలు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించారు. ముఖ్యంగా సంగీత దర్శకులు గిబ్రాన్ చక్కని సంగీతం సమకూర్చారు. ట్రైలర్‌లో యాక్షన్, పోరాట సన్నివేశాలతో కూడిన సస్పెన్స్ ఆకట్టుకునే విధంగా ఉంది.

    English summary
    Kamal will join hands with famous Malayalam movie director T.K.Rajeev Kumar. He has already won National award and he is touted to be Kamal haasan’s next director. Sources say talks are on with both sides and an official confirmation will be made by the director himself.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X