డైరక్టర్ ట్విస్ట్... కార్తీ ద్విపాత్రాభినయం
కథలో భాగంగా ప్రభు-శరణ్య దంపతుల కుమారుడిగా కార్తీ నటిస్తున్నాడు. ప్రభు యుక్త వయస్సుకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు ఉన్నాయట. ఇందుకోసం ప్రభుకు మేకప్ వేసినా ఆయనలో యవ్వన ఛాయలు కనిపించలేదట. మరికొందరిని పరీక్షించిన దర్శకుడికి చివరగా ఓ ఆలోచన తట్టిందట. కార్తీ ఎలాగూ ప్రభుకు కొడుకుగా నటిస్తున్నాడు. ప్రభు ఫ్లాష్‌బ్యాక్‌లో ఆయన యువకుడిగా ఉండే పాత్రను కార్తీతోనే వేయిస్తే పోలా అనుకున్నాడట. ఇందుకు కార్తీ కూడా పచ్చజెండా వూపటంతో ప్రస్తుతం అందుకు సంబంధించిన షూటింగ్ కొనసాగిస్తున్నారు.
తమిళంలోనే కాకుండా తెలుగులోనూ తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకున్న హీరో కార్తీ. అయితే ఆయనకు రీసెంట్ గా హిట్ అనేది కరువైంది. వచ్చిన ప్రతీ సినిమా బోల్తా కొట్టింది. ఎన్నో అంచనాలతో వచ్చిన 'బ్యాడ్ బోయ్ ' ఆయన్ను మరింత నిరాశలోకి నెట్టింది. దాంతో ఎక్కువ సినిమాలు చేస్తే అందులో కొన్నైనా హిట్ అయ్యి...తనని నిలబెడతాయనే స్టాటజీకి తెర తీస్తున్నాడు. ఇప్పటికే ఈ స్టాటజీని తెలుగులో హీరోలు పాటిస్తున్నారు.
ఈ నేఫద్యంలో కార్తీ విజయం కోసం తహతహలాడుతున్నాడు. హిట్ అనివార్యమైన నేపథ్యంలో సినిమాల సంఖ్య కూడా పెంచాడు. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'బిరియాని'లో నటిస్తున్నాడు. చివరి దశలో ఉంది. మరోవైపు రాజేష్ దర్శకత్వంలో 'ఆల్ ఇన్ ఆల్ అళగురాజా' చేస్తున్నాడు. మరో కొత్తకథకు కూడా పచ్చజెండా వూపినట్లు సమాచారం. 'అట్టకత్తి'లాంటి వైవిధ్య చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రంజిత్. స్టార్ హీరోలు లేకున్నా ప్రేక్షకులను మెప్పించటంలో విజయవంతమైంది. రంజిత్ దర్శకత్వంలో కార్తీ నటించనున్నట్లు కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. 'సాప్పాట్టు పరంబరై' అన్న పేరు ఖరారు చేసినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications












