»   » నాగచైతన్యతో కాదు..కార్తీతో

నాగచైతన్యతో కాదు..కార్తీతో

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: మణిరత్నం దర్శకత్వంలో చిత్రం గురించి గత కొంత కాలంగా తెలుగు,తమిళ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఆ మధ్యన నాగచైతన్య, రానా లతో ఓ ప్రాజెక్టు ప్రారంబిస్తారని వినిపించింది. అయితే ఇప్పుడా ప్లాన్ మారిందని, తమిళ హీరో కార్తీ సీన్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది.

Karthi in Mani Ratnam’s next?

మొదట నాని,కార్తీలతో ఈ చిత్రం అనుకున్నారు. అయితే అది మెటీరియలైజ్ కాక నాగచైతన్య, రానా అనుకున్నారు. అయితే అదీ ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు కార్తి ని ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. మరి వేరే హీరోగా ఎవరిని ఫైనలైజ్ చేస్తారో చూడాలి.

త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కనుంది. బహుసా జూన్ నెలాఖరకు ఈ ప్రాజెక్టు మెటీరయలైజ్ కావచ్చు. ప్రేమమ్ లో చేసిన మళయాళి సాయి పల్లవి ని హీరోయిన్ గా కార్తీ సరసన మణి రత్నం ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది.

Karthi in Mani Ratnam’s next?

ఈ మేరకు సాయి పల్లవి ...చెన్నైలోని మణిరత్నం ఆఫీస్ మద్రాస్ టాకీస్ వచ్చి ఫొటో షూట్ లో పాల్గొందని సమాచారం. ఆమె ఫొటో షూట్ తో మణిరత్నం చాలా సంతృప్తి చెందినట్లు చెన్నై సినీ వర్గాలు చెప్తున్నారు. మొత్తానికి నాగచైతన్య ప్లేస్ లోకి కార్తి వచ్చాడన్నమాట.

English summary
Mani Ratnam is now planning his next film with Karthi. This project might go on floors in the month of June.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu