twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నీచంగా సోషల్ మీడియాలో ట్రోల్స్: ఆ హీరో అభిమానులపై కేసు?

    |

    తమిళ స్టార్ హీరో విజయ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎవరైనా తమ హీరోపై విమర్శలు చేసినా, అతడికి వ్యతిరేకంగా ఏదైనా స్టేట్మెంట్స్ ఇచ్చినా.... సోషల్ మీడియాలో తమ కామెంట్లతో ట్రోల్ చేస్తూ వేధింపులకు గురి చేస్తారు. ఇటీవల చేసిన ఓ కామెంటుతో తమిళ నటుడు కరుణాకరన్... విజయ్ అభిమానులకు టార్గెట్ అయ్యాడు. తనను సోషల్ మీడియాలో చాలా నీచమైన పదజాలంతో ట్రోల్ చేస్తుండటంతో మనోవేదనకు గురవుతున్న కరునాకరన్ వారిపై పోలీస్ కంప్లయింట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.

    కమీషనర్‌ను కలవబోతున్న కరుణాకరన్

    కమీషనర్‌ను కలవబోతున్న కరుణాకరన్

    సోమవారం చెన్నై పోలీస్ కమీషనర్‌ను కలిసి తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ మీద కరుణాకరన్ ఫిర్యాదు చేయబోతున్నట్లు సమాచారం. విజయ్ అభిమానుల వేధింపుల వల్ల తాను తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు ఆయన ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.

    ట్రోల్స్ ఎందుకు ఇలా చేస్తున్నారంటే?

    ట్రోల్స్ ఎందుకు ఇలా చేస్తున్నారంటే?

    ట్రోలింగ్ జరుగడానికి కారణం... ఇటీవల కరుణాకరన్ చేసిన కామెంట్సే. విజయ్ రాజకీయాల వైపు రావాలని అభిమానులు కోరుకుంటున్న నేపథ్యంలో అతడు స్పందిసతూ... ‘విజయ్ రాజకీయాల్లోకి వచ్చే ముందు అతడి అభిమానులకు బుద్ది చెప్పాలి. వారు తమ మాటలతో ఎవరినీ వేధించకుండా ఉండేలా చూడాలి' అంటూ వ్యాఖ్యానించారు.

    చంపేస్తామని బెదిరింపులు

    చంపేస్తామని బెదిరింపులు


    కరుణాకరన్ వ్యాఖ్యలతో విజయ్ అభిమానులు మరింత ఆగ్రహానికి గురయ్యాడు. సోషల్ మీడియాలో అతడిని అబ్యూస్ చేయడమే కాకుండా కొందరు గుర్తు తెలియని అభిమానుల నుండి నిన్ను చంపేస్తాం అంటూ బెదిరింపులు కూడా వస్తున్నాయట.

    విజయ్ ఫ్యాన్స్ గతంలో కూడా

    విజయ్ ఫ్యాన్స్ గతంలో కూడా


    ‘గతంలో కూడా విజయ్ అభిమానులు ఓ జర్నలిస్టు మీద తీవ్రమైన ట్రోలింగ్ చేశాడు. అసభ్య పదజాలంతో దూషిస్తూ రాక్షసానందం పొందారు. అయితే ఫ్యాన్స్ ఇంత చేస్తున్న విజయ్ సమయానికి స్పందించక పోవడం అప్పట్లో విమర్శలకు దారితీసింది.

    English summary
    Actor Karunakaran will reportedly file a case against the fans of Vijay who abused and trolled him on social media. Karunakaran has been mercilessly trolled by Vijay fans for a negative comment against them. The actor had tweeted recently that Thalapathy should ask his fans to not abuse anyone before he forays into politics.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X