»   » అత్యాచారం కు గురైన హీరోయిన్ మీడియా ముందుకు, హీరో విశాల్ చేతులెత్తేసారంటూ...

అత్యాచారం కు గురైన హీరోయిన్ మీడియా ముందుకు, హీరో విశాల్ చేతులెత్తేసారంటూ...

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  చెన్నై: రెండు రోజుల క్రితం హీరోయిన్ సినీ నటి అతిథి అలియాస్ అథిరా సంతోష్ లైంగిక వేధింపులకు గురి అయ్యి, ఆత్మహత్య ప్రయత్నం చేసిన వార్త సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. చెన్నైలో హాస్పటిల్ లో చేరిన ఆమె ఇప్పుడు ఆరోగ్యం కుదుట పడటంతో మీడియా ముందుకు వచ్చింది. అసలేం జరిగిందో వివరించే ప్రయత్నం చేసింది.

  హీరోయిన్ అధిరా సంతోష్ మాట్లాడుతూ...దర్శకుడు సెల్వకణ్ణన్ వేధింపులకు గురి చేయడం వల్లే ఆత్మహత్యాయత్నం చేశానని సినీ నటి అతిథి అలియాస్ అథిరా సంతోష్ వెల్లడించింది. తనను చంపుతానని బెదిరించాడని వాపోయింది. గత నెల 28న విషం తాగి ఆమె ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ఆమె కోలుకుంది.

  సెల్వకణ్ణన్ పై నడిగర్ సంఘానికి ఫిర్యాదు చేశానని మీడియాతో అతిథి చెప్పింది. నడిగర్ సంఘంలో సభ్యుడు కానందున అతడిపై చర్య తీసుకోలేమని అధ్యక్షుడు విశాల్ చెప్పారని వెల్లడించింది. దీంతో సెల్వకణ్ణన్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

  మలయాళంలో ఇప్పటికే పలు టీవీ సీరియల్స్ లో నటించిన అతిథి, తమిళంలో 'నెదునల్వాడై' చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ప్రేమిస్తున్నానంటూ సెల్వకణ్ణన్ తన వెంటపడి వేధించాడని ఆమె ఆరోపించింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడని వాపోయింది. తాను ఒప్పుకోకపోవడంతో చంపుతానని బెదిరించాడని తెలిపింది. అతడి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించినట్టు వెల్లడించింది.

  వివరాల్లోకి వెళితే..మలయాళంలో పలు సీరియళ్లలో నటించిన అదితి అలియాస్ అథిరా సంతోష్ తమిళంలో నెదునల్వాడై అనే సినిమా ద్వారా హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తోంది. అయితే.. ఆ సినిమా డైరెక్టర్ సెల్వ కన్నన్ నుంచి ఆమె లైంగిక వేధింపులు ఎదుర్కొంది. శారీరకంగా, మానసికంగా తనను విపరీత ధోరణిలో వేధించాడని అదితి ఆరోపించింది.

  ఆత్మహత్యకు యత్నించి

  ఆత్మహత్యకు యత్నించి

  మలయాళ హీరోయిన్ అతిథి అలియాస్ అతిరా సంతోష్ పై తమిళ దర్శకుడు సెల్వ కన్నన్ అత్యాచారం చేశాడు. దీంతో ఆమె ఆత్మహత్య కు యత్నించి ఆసుపత్రి పాలయ్యింది . ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటోంది అతిథి .

  ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది

  ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది

  అలియాస్ అతిరా చేసిన ఫిర్యాదుతో ద‌ర్శ‌కుడు సెల్వ క‌న్న‌న్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.. ఈ మలయాళ న‌టి ప్రస్తుతం తమిళంలో సెల్వ కన్నన్ దర్శకత్వంలో "నేదునాల్ వాడై " చిత్రంలో నటిస్తోంది .

  అత్యాచాలం చేయటమే కాక

  అత్యాచాలం చేయటమే కాక

  కాగా షూటింగ్ సమయంలో పలు మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడ‌ని ఆమె ఆ కంప్లైంట్ లో ఆరోపించింది. అత్యాచారం చేయడమే కాకుండా పలు మార్లు మానసికంగా కూడా వేధింపులకు గురయ్యేలా చేసాడని హాస్ప‌ట‌ల్లో వాపోయింది..

  ఇండస్ట్రీ అంతా షాక్

  ఇండస్ట్రీ అంతా షాక్

  తనపై జరుగుతున్న వేధింపులు త‌ట్టుకోలేకే ఆత్మ‌హ‌త్య కు పాల్ప‌డ్డాన‌ని పేర్కొంది . హీరోయిన్ పై అత్యాచారం అని తెలియగానే యావత్ చలనచిత్ర పరిశ్రమ షాక్ కి గురయ్యింది . నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ అతిథి ని ఆసుపత్రిలో పరామర్శించాడు.

  చర్యలు తీసుకుంటామని హీరో విశాల్ హామీ

  చర్యలు తీసుకుంటామని హీరో విశాల్ హామీ

  సినీ ప‌రిశ్ర‌మ అంతా అండ‌గా ఉంటుందని, జ‌రిగిన దానికి త‌గిన న్యాయం చేస్తాన‌ని ఆయ‌న ఆమెకు భ‌రోసా ఇచ్చాడు. అలాగే సెల్వ కన్నన్ పై చ‌ర్య‌లు తీసుకునేందుకు న‌డిగ‌ర్ సంఘం కార్య‌వ‌ర్గ స‌మావేశాన్ని ఏర్పాటు చేశాడు విశాల్.. ఇందులో సెల్వ క‌న్న‌న్ భ‌విష్య‌త్ ను తేల్చునున్నారు..

  ప్రేమ పేరుతో... వేధింపులు

  ప్రేమ పేరుతో... వేధింపులు

  కేరళకు చెందిన అదితి సిని అవకాశాల కోసం చెన్నై వచ్చింది. ఈ క్రమంలోనే పరిచయమైన సెల్వ కన్నన్ తను ఆమెను ప్రేమిస్తున్నట్లు వెంటపడ్డాడు. ఆమె నిరాకరించడంతో పెళ్లి చేసుకుంటానని వేధింపులకు గురిచేశాడు.

  బంధిస్తే...తప్పించుకుని పారిపోయింది

  బంధిస్తే...తప్పించుకుని పారిపోయింది

  ఏకంగా ఓ ఇంట్లో బంధించాడు. దీంతో అదితి ఎలాగోలా తప్పింకొని కేరళకు తిరిగి వెళ్లిపోయింది. అయితే ఆ తర్వాత ఆమె కోసం ఈ దర్శకుడు చాలా ఎంక్వైరీ చేసారు. అయితే మరీ ముందుకు వెళితే ఆమె తరుపు వారు ఏదైనా చేస్తారని భయంతో వెనక్కి తగ్గాడు.

  చెన్నై మళ్లీ వస్తే..

  చెన్నై మళ్లీ వస్తే..

  కొద్దికాలం తర్వాత ఓ యాడ్ కోసం చెన్నైకి తిరిగి వచ్చినపుడు సెల్వకన్నన్ మరోమారు కొందరితో కలిసి షూటింగ్లోనే ఇబ్బందిపెట్టాడు. దీంతో అదితి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అయితే ఇప్పటివరకు ఈ విషయమై సెల్వ కన్నన్ అధికారికంగా స్పందించలేదు.

  వాట్సప్ లో మెసేజ్ ..

  వాట్సప్ లో మెసేజ్ ..

  వాస్తవానికి సెప్టెంబరు 29న ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని వాట్సాప్‌లో మెసేజ్ చక్కర్లు కొట్టింది. దీంతో దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆస్పత్రిలో ఆమె సెల్వకన్నన్‌తో ఎదుర్కొన్న చేదు అనుభవాలను మీడియాకు తెలియజేసింది.

  తిరస్కరించానని పగ పట్టి మరీ

  తిరస్కరించానని పగ పట్టి మరీ

  సినిమా మొదలైన నాటి నుంచి సెల్వకన్నన్ తనను వేధిస్తున్నాడని చెప్పింది. పదేపదే సెల్వ కన్నన్ తనను ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడని, ప్రేమను నిరాకరిస్తే బెదిరించేవాడని తెలిపింది. అతడి ప్రేమను తిరస్కరించినప్పట్నుంచి సెల్వకన్నన్ వేధింపులు ఎక్కువయ్యాయని, ఓ సారి తనను గదిలో కూడా నిర్బంధించాడని విలపించింది.

  తను మెంబర్ కానందను కంప్లైంట్ తీసుకోమన్నారని

  తను మెంబర్ కానందను కంప్లైంట్ తీసుకోమన్నారని

  ఎలాగోలా తప్పించుకుని కేరళలోని తన ఇంటికి వెళ్లిపోయానని చెప్పింది. దానిపై అటు పోలీసులకు, నడిగర్ సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయింది. తాను నడిగర్ సంఘంలో సభ్యురాలిని కానందువల్ల తన ఫిర్యాదు తీసుకోబోమని నడిగర్ సంఘం చెప్పినట్టు అదితి వివరించింది.

  పెళ్లి చేసుకోపోతే చంపేస్తా

  పెళ్లి చేసుకోపోతే చంపేస్తా

  అయితే.. ఇటీవల ఓ ప్రకటన షూటింగ్ కోసం చెన్నైకి వచ్చానని, ఆ షూటింగ్ స్పాట్‌కు కొంతమంది వ్యక్తులతో వచ్చిన సెల్వకన్నన్.. తనను శారీరకంగా హింసించాడని, లైంగికంగా వేధించాడని, తనతలను గోడకేసి బాదాడని విలపించింది. పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని బెదిరించినట్లు వివరించింది. అందుకే తాను ఆత్మహత్యకు ప్రయత్నించానని వెల్లడించింది.

  English summary
  Adhiti attempted suicide in Chennai and had to be admitted to the ICU of a private hospital after she was allegedly tortured by film director Selva Kannan. Adhiti is playing a pivotal role in the debutante director’s a new movie Nedunalvaadai. Adhiti aka Athira Santhosh (21), an Idukki native, talks to Onmanorama about what forced her to take the extreme step
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more