twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సబ్ కలెక్టర్ సాక్షిగా... ఆ మూవీ వద్దు, ఈ సినిమానే చూస్తామంటూ!

    |

    తమిళంలో సూపర్ స్టార్ ఎవరు అంటే రజనీకాంత్ అని ఎవరైనా తడుముకోకుండా చెబుతారు. అయితే రజనీ తర్వాత ఆ స్థానం ఎవరికి దక్కుతుంది అంటే మెజారిటీ తమిళ ఆడియన్స్ విజయ్ పేరు చెబుతున్నారు. వరుస విజయాలతో విజయ్ తమిళ యువతలో, పిల్లల్లో రోజు రోజుకు క్రేజ్ పెంచుకుంటూ మాస్ హీరోగా అవతరిస్తున్నారు.

    కేవలం తమిళనాడులో మాత్రమే కాదు... కేరళలోనూ అతడికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా కేరళ వాయనాడు సబ్ కలెక్టర్ ఉమేష్ కేశవన్ గిరిజన బాలికలతో సర్కార్ సినిమా చూశారు. అనంతరం తన అనుభవాన్ని ఫేస్ బుక్ ద్వారా పంచుకున్నారు.

    ‘సర్కార్' బదులు 2.0 తీసుకెళ్లాలనుకున్నప్పటికీ...

    ‘సర్కార్' బదులు 2.0 తీసుకెళ్లాలనుకున్నప్పటికీ...

    ఇక్కడి మహిళా సమాఖ్య వసతి గృహానికి చెందిన పిల్లలకు సినిమా చూపించాలని ఉమేష్ కేశవన్ భావించారు. వీరికి ‘సర్కార్' సినిమా చూపించాలని భావించినప్పటికీ అందులో రాజకీయ పరమైన అంశాలు ఎక్కువగా ఉన్నాయనే వాదన ఉండటంతో... వారిని త్వరలో విడుదల కాబోయే రజనీకాంత్ 3డి మూవీ 2.0కు తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు.

    వారి రియాక్షన్ చూసి సబ్ కలెక్ట్ ఆశ్చర్యం

    అయితే తన నిర్ణయం బాలికలకు చెప్పగానే వారి నుంచి వచ్చిన రియాక్షన్ చూసి సబ్ కలెక్టర్ ఆశ్చర్యపోయారు. వారంతా తమకు ‘సర్కార్' సినిమా చూడాలని ఉందని, ఆ సినిమాకే తీసుకెళ్లాలని పట్టుబట్టారట. ఈ విషయాన్ని ఆయన తన ఫేస్ బుక్ పోస్టులో వెల్లడించారు.

    ‘సర్కార్' సౌతిండియా రికార్డ్

    ‘సర్కార్' సౌతిండియా రికార్డ్

    విజయ్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కార్' చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 220 కోట్లకుపైగా వసూలు చేసి 2018 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ సినిమాగా నిలిచింది.

    రజనీకాంత్ 2.0

    రజనీకాంత్ 2.0

    రజనీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో శంకర్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘2.0'. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో రూ. 600 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    English summary
    Took kids from Mahila Samakhya hostel for tribal kids (Mananthavady) to see "Sarkar" movie today. I was not interested to take them for this movie as it is too political for their innocent tastes. I offered them to take for the 3D version of "2.0" whenever it releases but they wished to see Vijay's movie only. The power of cinema and superstars in influencing young minds positively is a largely untapped area so far." Umesh Kesavan, the sub-collector of Vayanadu, Kerala shared his experience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X