ఎన్టీఆర్‌పై పూర్తిగా ఆశలు వదులుకున్న స్టార్ డైరెక్టర్.. మళ్ళీ బాలీవుడ్ వైపే..
జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులకు ఒక బలమైన కోరిక ఉంటుంది. ఎందుకంటే తారక్ ఎలాంటి పాత్రలో అయినా ప్రాణం పెట్టి నటించగలడు. అందుకే మార్కెట్ తో సంబంధం లేకుండా అలంటి టాలెంటెడ్ హీరోతో ఒక్క సినిమా చేయాలని కొందరు ఓపెన్ గానే చెప్పేశారు. తమిళ్ లో అగ్ర దర్శకుడు అట్లీ గత రెండేళ్లుగా ఎన్టిఆర్ తో సినిమా చేసేందుకు చాలా ప్రయత్నం చేశాడు.
ఎన్టీఆర్ కూడా ఆ దర్శకుడితో సినిమా చేసేందుకు మొదటి నుంచి ఆసక్తి చూపిస్తున్నాడు. కానీ అనుకోని కామిట్మెంట్స్ వలన కుదరడం లేదట. RRR కోసమే గత రెండేళ్లుగా కష్టపడుతున్నాడు. ఇక ఆ సినిమా అనంతరం మరో రెండు పెద్ద సినిమాలను లైన్ లో పెట్టాడు. ముందుగా కొరటాల శివ ఆ తరువాత KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమాను ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా ఉప్పెన దర్శకుడు కూడా రెడీగా ఉన్నాడు.

ఇక ఈ బిజీ షెడ్యూల్ వలన ఎన్టీఆర్ తో సినిమా ఇప్పట్లో కుదిరేలా లేదని దర్శకుడు అట్లీ మనసు మార్చుకున్నట్లు సమాచారం. ఇక ఎంత ఆలస్యం అయినా ముందు షారుఖ్ ఖాన్ తోనే సినిమా చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. కానీ ఆ హీరో కూడా ఎందుకో అట్లీకి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. రాజ్ కుమార్ హిరానితో ఒక సినిమా ఫిక్స్ అవ్వగానే షారుక్ కూడా అట్లీ సినిమాను పక్కన పెట్టేశాడు. కానీ అట్లీ మాత్రం ఎలాగైనా షారుక్ తో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











