Gentleman 2 ప్యాన్ ఇండియా మూవీతో స్టార్ ప్రొడ్యూసర్ కుంజుమన్.. 27 ఏళ్ల తర్వాత జెంటిల్మన్ సినిమాకు సీక్వెల్

దక్షిణాది సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్ చిత్రాలకు, సెన్సేషనల్ ప్రాజెక్టులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుల్లో కేటీ కుంజుమన్ ఒకరు. ఒకానొక సమయంలో తన క్రేజీ ప్రాజెక్టులతో భారతీయ సినిమాను తనవైపుకు తిప్పుకొన్న నిర్మాతగా పాపులారిటిని సంపాదించుకొన్నారు. అయితే వరుస పరాజయాలు పలకరించడంతో ఎంత స్పీడ్‌లో వచ్చారో.. అంతే స్పీడ్‌లో కనుమరగయ్యారు. అయితే మరోసారి భారీ ప్రాజెక్టుతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్దమయ్యారు. ఆ ప్రాజెక్ట్ వివరాల్లోకి వెళితే.. '

జెంటిల్మన్ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటి

జెంటిల్మన్ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటి

కేటీ కుంజుమన్ చెబితే గుర్తుకు వచ్చేది జెంటిల్మన్. ఈ సినిమాకు ముందు 15 సినిమాలు నిర్మించినప్పటికీ.. పెద్దగా పేరు రాలేదు. కానీ శంకర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందించిన జెంటిల్మన్ సంచలన విజయం సాధించింది. శ్రీలంక అధ్యక్షుడు రణసింఘే ప్రేమదాస హత్య ఘటనను క్లైమాక్స్ తీయమని చెప్పడం.. క్లైమాక్స్ సినిమాను మరోలెవల్‌కు తీసుకెళ్లింది. జెంటిల్మన్ సినిమా తర్వాత నిర్మాతగా ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. జెంటిల్మన్ తర్వాత ప్రేమికుడు, ప్రేమదేశం చిత్రాలు దేశంలోనే భారీ వసూళ్లు సాధించిన చిత్రాలుగా రికార్డు సాధించాయి.

నాగార్జునతో రక్షకుడు తీసి.. దారుణమైన నష్టాల్లో

నాగార్జునతో రక్షకుడు తీసి.. దారుణమైన నష్టాల్లో


వరుస విజయాలు, సెన్సేషనల్ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్న కేటీ కుంజుమన్ తన కెరీర్‌లో తీవ్రమైన షాక్ తిన్నారు. నాగార్జున, సుస్మితా సేన్‌తో తీసిన రక్షకుడు చిత్రం భారీ పరాజయం పొందింది. దాంతో కుంజుమోహన్ భారీ నష్టాలను ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత విజయ్‌తో తీసిన సినిమా నీవావే వా, ఎందరేంద్రం కాదల్ సినిమాలు విజయాలు సాధించలేకపోవడంతో వెనకపడిపోయారు.

జెంటిల్మన్ సీక్వెల్‌తో మరోసారి

జెంటిల్మన్ సీక్వెల్‌తో మరోసారి

దక్షిణాది చిత్ర పరిశ్రమకు దూరమైన కేటీ కుంజుమన్ మరోసారి తనకు పాపులారిటిని సంపాదించిపెట్టిన జెంటిల్మన్‌ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. జెంటిల్మన్ సీక్వెల్‌ను జెంటిల్మన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రూపొందించడానికి సిద్దమయ్యారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా కుంజుమన్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చెబితే లక్కీ విజేతలకు బంగారు కాయిన్ ఇస్తానని ఓ క్విజ్‌ను కూడా పెట్టారు.

జెంటిల్మన్ 2 సినిమాకు ఎంఎం కీరవాణి

జెంటిల్మన్ 2 సినిమాకు ఎంఎం కీరవాణి


తాను ప్రకటించిన క్విజ్‌లో భాగంగా కుంజుమన్ జెంటిల్మన్ 2 సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంఎం కీరవాణిని ఎంపిక చేసినట్టు ప్రకటించారు. ఈ సంచలన ప్రాజెక్టులో భాగమైన కీరవాణితో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నా సినిమాకు కీరవాణి గారిని మ్యూజిక్ డైరెక్టర్‌గా ప్రకటిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది అంటూ ట్వీట్‌లో కుంజుమన్ తెలిపారు.

27 ఏళ్ల తర్వాత బ్లాకబస్టర్ మూవీకి సీక్వెల్

27 ఏళ్ల తర్వాత బ్లాకబస్టర్ మూవీకి సీక్వెల్

అర్జున్ సర్జా, మధుబాల జంటగా నటించిన జెంటిల్మన్ సినిమా వచ్చి 27 ఏళ్లు పూర్తి చేసుకొన్నది. సంచలన విజయం సాధించిన ఆ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్‌గా తీయాలని కేటీ కుంజుమన్ ప్లాన్ చేశారు. కానీ ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించడం లేదు. ప్రతిభావంతులైన మరో టీమ్‌తో జెంటిల్మన్ 2 సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్యాన్ ఇండియాగా రూపొందే ఈ సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణులను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తున్నట్టు ఆయన తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X