»   » రజనీకాంత్ ప్రశంసతో ప్రపంచాన్ని జయించా!

రజనీకాంత్ ప్రశంసతో ప్రపంచాన్ని జయించా!

Written By:
Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళ చిత్రం 'కుట్రం 23'పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రాన్ని రజనీ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఆ సందర్భంగా యూనిట్ సభ్యులందర్ని రజనీ ప్రశంసించారు. హీరో అరుణ్, దర్శకుడు, నిర్మాతను తన ఇంటికి ప్రత్యేకంగా పిలిపించుకొని వారితో ముచ్చటించి అభినందించారు.

ప్రపంచాన్ని జయించినట్టు

ప్రపంచాన్ని జయించినట్టు

రజనీ ప్రశంసలతో హీరో అరుణ్ ఆనందంతో ఎగిరి గంతేస్తున్నాడు. రజనీసార్ ప్రశంసతో ప్రపంచాన్ని జయించినట్టు ఉంది అని అరుణ్ పేర్కొన్నారు. స్వయంగా ఇంటికి పిలిచి అభినందించారు. రజనీ ప్రశంసను చివరికి వరకు గుండెల్లో దాచుకొంటాను అని అన్నారు.

తమిళ నవల ఆధారంగా..

తమిళ నవల ఆధారంగా..

ఈ చిత్రానికి అరివజగన్ దర్శకత్వం వహించారు. తమిళ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మెడికల్ క్రైమ్ కథా నేపథ్యంగా కుట్రం 23 రూపొందింది. ఈ చిత్రంపై ప్రముఖ దర్శకుడు శంకర్, ఇతర సినీ ప్రముఖులతోపాటు సినీ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ప్రత్యేకంగా సమయం కేటాయించిన శంకర్

ప్రత్యేకంగా సమయం కేటాయించిన శంకర్

రోబో 2.0 షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ ఈ చిత్రాన్ని చూడటానికి దర్శకుడు శంకర్ సమయాన్ని కేటాయించారు. అనంతరం ఈ చిత్ర యూనిట్‌ను ట్విట్టర్‌లో ప్రత్యేకంగా అభినందించారు. ‘ఇంటెన్స్ ఫిల్మ్ మేకింగ్‌తో అన్ని4 అంశాలను కలిపి దర్శకుడు అరివజగన్ కుట్రంను అద్భుతంగా తెరకెక్కించారు‘ అని శంకర్ ట్వీట్ చేశారు.

థ్యాంక్యూ శంకర్ సర్..

థ్యాంక్యూ శంకర్ సర్..

శంకర్ ట్వీట్‌పూ హీరో అరుణ్ విజయ్ స్పందిస్తూ థాంక్యూ ఎలాట్ సర్. మీ ప్రశంస ఎంతో ప్రభావితం చేసింది అని ట్వీట్ చేశాడు. అన్నివర్గాల నుంచి అభినందనలు రావడంతో అరుణ్ ఆనందంతో పొంగిపోతున్నాడు.

భారీ వసూళ్లు రాబడుతున్న..

భారీ వసూళ్లు రాబడుతున్న..

మానగరం, మెట్టా శివ, కెట్టా శివ లాంటి హిట్ చిత్రాలను తట్టుకొని కుట్రం23 చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. కేవలం చెన్నైలోని తొలివారం రూ.1.22 కోట్లు వసూలు చేయడం గమనార్హం.

English summary
Actor Arun Vijay’s excitement knew no bounds when superstar Rajinikanth called and congratulated him on his performance from latest Tamil film Kuttram 23. He said the appreciation meant the world to him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu