»   » కాన్సర్ పేషెంట్ అభిమాని కోరిక నెరవేర్చిన ఇళయరాజా

కాన్సర్ పేషెంట్ అభిమాని కోరిక నెరవేర్చిన ఇళయరాజా

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: క్యాన్సర్‌ మహమ్మారికి గురైన తన అభిమాని కోరికను నెరవేర్చారు సంగీతజ్ఞాని ఇలయరాజా. చెన్నై అంబత్తూర్‌కు చెందిన ఆర్‌ఎస్‌ రవిచంద్రన్‌ (44) అవివాహితుడు. గత కొంత కాలంగా తీవ్రమైన దగ్గు, గొంతు నొప్పితో ఇబ్బంది పడగా.. ఓ ఆస్పత్రిలో చికిత్సకు తీసుకెళ్లారు. రవిచంద్రన్‌ను పరీక్షించిన వైద్యులు ఆయనకు క్యాన్సర్‌ ఉన్నట్లు తేల్చారు. అంతేకాకుండా ఆయన కోరికలను తెలుసుకుని తీర్చమని వైద్యులు కూడా బంధువులకు సలహా ఇచ్చారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

layaraja Fulfils Final Wish Of Terminally Ill Cancer Patient in Chennai

దీంతో బంధువులు రవిచంద్రన్‌ను అడగ్గా.. ఇలయరాజాను ఒక్కసారి చూడాలని చెప్పారు. ఆ విషయం ఇలయరాజాకు తెలియడంతో తన స్టూడియోకు రమ్మని కబురు పంపారు. ఆ మేరకు ప్రసాద్‌ ల్యాబ్‌లోని స్టూడియోలో అతనిని కలిశారు. ఈ సందర్భంగా రవిచంద్రన్‌ను ఇలయరాజా ఓదార్చారు. అంతేకాకుండా అభిమానంతో కాసేపు మాట్లాడారు.

layaraja Fulfils Final Wish Of Terminally Ill Cancer Patient in Chennai
layaraja Fulfils Final Wish Of Terminally Ill Cancer Patient in Chennai

ఈ సందర్భంగా రవిచంద్రన్‌ మాట్లాడుతూ.... నేను 1980వ సంవత్సరం నుంచి మీకు తీవ్రమైన అభిమానిని. ఆనందం, దుఖం... ఏదైనా నాకు మీ పాటలే సకలం. బాధ ఉన్నా.. మీ పాట విని సంతోషపడతానని చెప్పారు. దీంతో రాజా కూడా భావోద్వేగానికి గురై ఆయన్ను హత్తుకున్నారు. కాసేపు మాట్లాడిన అనంతరం రవిచంద్రన్‌ వెళ్లిపోయారు.

English summary
Ilayaraja Fulfils Final Wish Of Terminally Ill Cancer Patient in Chennai.
Please Wait while comments are loading...