For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వాట్సప్ లో లీకైంది: 'పులి' కథ ఇదే

  By Srikanya
  |

  చెన్నై: తమిళ స్టార్ హీరో విజయ్‌, శ్రుతిహాసన్‌, అతిలోక సుందరి శ్రీదేవి, హన్సిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'పులి'. చింబుదేవన్‌(23 ఏఏఎమ్‌ పులికేసి ఫేం) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కిచ్చా సుదీప్‌, శృతి హాసన్‌, హన్సిక, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ,టీజర్ ని విడుదల చేసారు. వీటికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకు యూట్యూబ్‌లో ఈ చిత్రం టీజర్‌ను దాదాపు 60 లక్షల పైగా వీక్షించారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ అంటూ వాట్సప్ లో ప్రచారం జరుగుతోంది. ఈ కథని క్రింద చదవండి

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  ఈ చిత్రం కథని శింబు దేవన్ రాసారు. పులి చిత్రం యాక్షన్ ఎడ్వెంచర్ ఫాంటసీ గా సాగుతుంది. ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తారు. ఈ కథ పురాతన కాలంలోనూ, ఇప్పటి మోడ్రన్ ప్రపంచంలోనూ జరుగుతుంది.

  ఈ సినిమాకు తెలుగులో కూడా మంచి క్రేజీ వస్తోంది. చిత్ర హక్కుల కోసం పలువురు నిర్మాతలు పోటీపడుతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. పోస్టర్‌లో విజయ్‌ మధ్యయుగానికి చెందిన వీరుడిలా కనిపిస్తున్నారు.

  నిర్మాత మాట్లాడుతూ ''ఈ సినిమాలో శ్రీదేవి ఓ బృందానికి నాయకురాలిగా... మహారాణిగా కనిపిస్తుంది. ఆమెకు అద్వితీయ శక్తులు, సామర్థ్యం ఉంటాయి. సినిమాలోని పోరాట సన్నివేశాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. శ్రీదేవి పునరాగమనం కోసం చాలా మంది నిర్మాతలు ప్రయత్నించారు. ఆమెకు మా కథ నచ్చి అంగీకరించారు. ''అన్నారు.

  కథ స్లైడ్ షోలో...

  ప్రారంభం

  ప్రారంభం

  ఈ కథ ఈ కాలంలో ప్రారంభమవుతుంది. విజయ్ ఓ పేద కుటుంబంలో పుడతాడు. అయితే ఆ రాజ్యంలో జరిగిన ఓ గొడవలో అతను ఓ పెద్ద వ్యాపారస్దుడు కొడుకుతో రీప్లేస్ చేయబడతాడు. దాంతో ఆ పెద్ద కుటుంబంలో అతను మంచి చదువు చదువుకుని, పోరాట విద్యలన్నీ నేర్చుకుంటాడు.

  శృతి హాసన్ తో

  శృతి హాసన్ తో

  అంతేకాదు అక్కడ అతను శృతి హాసన్ తో ప్రేమలో పడతాడు. కొంతమంది క్రిమినల్స్ ఆమెను కిడ్నాప్ చేస్తాడు. ఆమెను రక్షించే సమయంలో ఆమె చనిపోతుంది.

  ఆత్మహత్యా ప్రయత్నం

  ఆత్మహత్యా ప్రయత్నం

  ఆ బాధతో అతను ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడు. ఓ కొండ మీద నుంచి దూకేస్తాడు.

  సుదీప్ ...

  సుదీప్ ...


  అయితే అతను కళ్లు తెరిచే సమయానికి అతని శరీరానికి చిన్న గాయం లేకుండా రక్షించబడతాడు. అప్పుడు అతనికి అర్దం అవుతుంది. తను దూకేసినప్పుడు అతను ఆ ఏరియా రాజు(కిచ్చా సుదీప్) ప్రాంతంలో పడ్డానని. అందుకే వారు రక్షించారని.

  శ్రీదేవి,హన్సిక

  శ్రీదేవి,హన్సిక

  శ్రీదేవి, హన్సిక ఇద్దరూ సుదీప్ కు తల్లి, సోదరిలు.

  ప్రతిభ, అసూయ

  ప్రతిభ, అసూయ

  సుదీప్ తో కలిసి విజయ్ అనేక పోరాటాల్లో పాల్గొని విజయం సాధిస్తాడు. అందరూ విజయ్ టాలెంట్ చూసి మెచ్చుకుంటారు. ఈ లోగా హన్సిక ప్రేమలో పడుతుంది. అయితే విజయ్ ఆమెను రిజెక్టు చేస్తాడు. ఈ లోగా సుదీప్ అతని పాపులారిటీ పెరగటం చూసి అసూయ పడి,చంపటానికి ప్రయత్నిస్తాడు.

  మ్యాజకల్ పవర్స్

  మ్యాజకల్ పవర్స్

  శ్రీదేవి కు కొన్ని మ్యాజికల్ పవర్స్ ఉంటాయి. ఆమె దగ్గర ఉన్న పెన్ ద్వారా ఆమె ఏ యుగానికి కావాలిస్తే అక్కడకి వెళ్లగలదు. అయితే సమస్య ఏమిటంటే...ఆమె వెళ్లటమే కాని ప్రెజంట్ కు రాలేదు.

  విజయ్ ని చంపేస్తాడు

  విజయ్ ని చంపేస్తాడు

  ఇంతలో విజయ్ ని సుదీప్ చంపేస్తాడు. ఈలోగా శ్రీదేవికి..సుదీప్ తన కొడుకు కాదు విజయ్ తన కొడుకు అని తెలుస్తుంది. అప్పుడు శ్రీదేవి ఏం చేసింది అనేది మిగతా కథ.

  పెరిగిన అంచనాలు

  పెరిగిన అంచనాలు

  ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ ఒక వారియర్ లుక్ లో కనిపించాడు. చూడడానికి డ్రెస్సింగ్ అంతా వారియర్ గెటప్ లో ఉన్నా తన హెయిర్ స్టైల్ లుక్ మాత్రం చాలా స్టైలిష్ గా ఉంది. దాంతో ఈ సినిమాపై అభిమానులకు అంచనాలు పెరుగిపోయాయి.

   గ్లాడియేటర్ తరహాలో

  గ్లాడియేటర్ తరహాలో

  ఈ సినిమా గురించి నిర్మాత షిబు తమీన్స్‌ ఒక ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించారు. హాలీవుడ్‌ చిత్రం 'ది గ్లాడియేటర్‌' పంథాలో ఈ సినిమా సాగుతుందట.

  English summary
  “Puli” is an action-adventure fantasy film and the makers have been guarding its story and details of all the characters fiercely. But now, the leak claims to reveal everything. The Story is Written by Chimbu Deven.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X