»   »  లేచిపోదామా...!

లేచిపోదామా...!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sandhya
'ప్రేమిస్తే' ఫేమ్ సంధ్య ఆ తరువాత పవన్ 'అన్నవరం' కొన్ని డబ్బింగ్ చిత్రాలు చేసింది. కానీ చెప్పుకోదగిన పేరు, ఆఫర్స్ రాలేదు. దాంతో నిరాశలో ఉన్నామెకు ఇప్పుడు 'లేచిపోదామా' అనే తమిళ, తెలుగు భాషల్లో నిర్మితమయ్యే చిత్రంలో ఆఫర్ వచ్చింది. నా ఊపిరి, చిన్నోడు, కాల్ సెంటర్ వంటి విభిన్న చిత్రాలను రూపొందించిన తమిళ దర్శకుడు కన్మణి ఈ సినిమాను డైరక్ట్ చేయనున్నాడు. ఇక హీరోయిన్ సంగీత సోదరుడు పరిమళ్ హీరోగా ఈ చిత్రంతో తెరంగ్రేటం చేస్తున్నాడు. ఆగస్టు 14 న ప్రారంభమయ్యే ఈ సినిమా ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ లా ఉంటుందిట. పూర్తి బౌండ్ స్క్రిప్టుతో తో వచ్చిన ఈ ప్రాజెక్టును వి.భరణి పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో అధికభాగం చెన్నై ,ఊటీలలో జరుపుకుంటుంది. ఈ సినిమా తో తెలుగు వారి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటానని ఇక్కడే సెటిలవ్వాలని ఉందని సంధ్య చెప్పుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X