కమల్ హాసన్, రజనీకాంత్.. థియేటర్లు తగలబడేలా లోకేష్ ప్లానింగ్.. సాధ్యమేనా?

తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ ను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'ఖైదీ' చిత్రం తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న ప్రతి చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉంటుండటం విశేషం. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కు దేశ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉండటంతో సినిమాలు కూడా అదే స్థాయిలో రూపుదిద్దుకుంటున్నాయి. ఈ క్రమంలో నెక్ట్స్ రాబోతున్న చిత్రాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. లోకేష్ కనగరాజ్ నెక్ట్స్ ఓ బిగ్ ప్రాజెక్ట్ కు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మేరకు కోలీవుడ్ మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...

సెన్సేషన్ క్రియేట్ చేసిన లోకేష్ కనగరాజ్..
కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ 'ఖైదీ' చిత్రంతో సెన్సేషన్ గా మారిన సంగతి తెలిసిందే. కార్తీ నటించిన ఢిల్లీ పాత్రతో క్రియేట్ చేసిన సినిమాటిక్ యూనివర్స్ కు ఆడియెన్స్ ఎంతగానో ఫిదా అయ్యారు. ఆ తర్వాత వచ్చిన కమల్ హాసన్ 'విక్రమ్' చిత్రంతో ఇక ఇండియాలోనే సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయారు. దీంతో లోకేషన్ కనగరాజ్ తో వర్క్ చేయడానికి స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. ఓవైపు బ్లాక్ బాస్టర్ చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూనే మరోవైపు ఇంట్రెస్టింగ్ చిత్రాలను నిర్మిస్తూ ప్రొడ్యూసర్ గా సక్సెస్ అందుకుంటున్నారు. నెక్ట్స్ లోకేష్ కనగరాజ్ నిర్మాతగా 'బెంజ్' అనే చిత్రం రాబోతోంది. ఇలా డైరెక్టర్ గా, నిర్మాతగా కోలీవుడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.

రజనీ, కమల్ హాసన్ తో బిగ్ ప్రాజెక్ట్..
లోకేష్ కనగరాజ్ ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ తో కలిసి పని చేశారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో ఓ క్రేజీ చిత్రాన్ని ప్లాన్ చేసినట్టు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అటు రజనీకాంత్ కు ఇటు కమల్ హాసన్ కు లోకేష్ కనగరాజ్ ఓ గ్యాంగ్ స్టర్స్ స్టోరీని చెప్పారంట.
ఇద్దరు వయస్సుబడ్డ గ్యాంగ్ స్టర్ ల కథతో క్రేజీ ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారంట. అయితే లోకేష్ కనగరాజ్ చెప్పిన స్టోరీ లైన్ కు ఇద్దరూ ఆసక్తి చూపించారంట.

కమల్ వివాదాన్ని పక్కన పెడతారా?
కాగా త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను ఫైనల్ చేయబోతున్నారని తెలుస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందా? అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. గతంలోనే కమల్ హాసన్, రజనీకాంత్ మధ్య ఉన్న కొన్ని విబేధాల కారణంగా కొన్నాళ్లు కలిసి నటించడం లేదు. ఇకపై నటించబోమని కూడా కమల్ హాసన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కాగా లోకేష్ కనగరాజ్ మాత్రం వీరిద్దరిని ఒప్పించి, సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడం సాధ్యమేనా అని అంటున్నారు.

నెక్ట్స్ రాబోయే చిత్రం 'కూలీ'..
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నెక్ట్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం 'కూలి'. రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించారు. నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ క్యామియో అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించడం విశేషం. పూజా హెగ్దే ఐటెమ్ సాంగ్ లో నటించింది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ రూ.350 కోట్లతో నిర్మించారు. ఇక ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X