»   » సీఎం జోక్యంతో స్టార్ హీరో వివాదానికి తెర

సీఎం జోక్యంతో స్టార్ హీరో వివాదానికి తెర

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాజకీయాంశాలకు చెందిన కా ర్యక్రమాల్లో పాల్గొనాలని నటీనటులను బలవంతం చేయడం సరికాదని 6న చెన్నైలో జరిగిన ముఖ్యమంత్రి కరుణానిధి సన్మాన కార్యక్రమంలో ఆవేశంగా ప్రసంగించిన అజిత్ వ్యా ఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ వివాదం పెరిగి పెద్దదవటంతో తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి స్వయంగా కలగచేసుకుని ఈ వ్యవహారానికి తెరదించాల్సి వచ్చింది. ఈ వివాదంతో తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి, నడిగర్ సంఘం మధ్య దూరం పెరగడమే కాకుండా, అజిత్‌పై చర్యలు తీసుకోవాలనే వరకు ఈ వ్యవహారం సాగడంతో తమిళ సినీ పరిశ్రమ రెండు విడిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో తాను సిని పరిశ్రమకు దూరం అవుతానని ఇకపై రేసులపై దృష్టి సారిస్తానంటూ అజిత్ ప్రకటించా రు. దీనిపై రజనీకాంత్ కూడా రెండు విధాలుగా మాట్లాడి, ఆపై సైలెంట్ అవటం కూడా విమర్శలకు దారితీసింది.

రజనీ కుమార్తె నిశ్చితార్థం మరుసటిరోజు రజనీకాంత్, అజిత్‌లు ఒకరి తరువాత ఒకరు ముఖ్యమంత్రిని కలుసుకోవడం తమిళ పరిశ్రమలో సంచలనమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కరుణానిధి తాజాగా మురసొలి పత్రికకు ఇచ్చిన ప్రకటనలో అజిత్ నిజాయితీని, డేరింగ్‌ని మెచ్చుకున్నారు. అజిత్ వ్యాఖ్యలు పెద్ద దు మారం రేపాయని, ఇందుకు పరోక్షం గా మీడియా కూడా కారణమని, పరిశ్రమలోని పలువురు ఈ విషయాన్ని మరీ పెద్దదిగా చేసి అనవసర రాద్దాం తం చేశారని వ్యాఖ్యానించారు. పరిశ్రమలో అందరూ ఐకమత్యం, క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. సన్మా న కార్యక్రమంలో తను చేసిన వ్యాఖ్యలపై అజిత్ వివరణ ఇచ్చారని, అవి తనకు వ్యతిరేకంగా కాదని స్పష్టం చే శారు.ఈ అంశాన్ని పలువురు తమకు అనుకూలంగా మలచుకున్నారని ఇది ఇక్కడితో ముగిసిపోవాలని అజిత్ కోరారని వివరించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu