»   » 'సఖి' మాధవన్ కొడుకు ఉపనయన వేడుక (ఫొటో)

'సఖి' మాధవన్ కొడుకు ఉపనయన వేడుక (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మణిరత్నం'సఖి' , యువ చిత్రాలతో తెలుగునాట సైతం ఫ్యాన్స్ ని క్రియేట్ చేసుకున్న మాధవన్ తాజాగా ఈ రోజు కుమారుడు వేదాంత్ కు ఉపయనం చేసారు. ఈ పంక్షన్ లో ఆయన,కుమారుడు, భార్య, ఇంకా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సంప్రదాయబద్దంగా ఈ వేడుక జరగింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మాధవన్ మొదటి నుంచి కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. అలాగే కల్చర్, సంప్రదాయం కు కూడా ఆయన ముందుంటారు. అందులో భాగంగానే తన కుటుంబ సంప్రదాయాన్ని అనుసరించిన తన కుమారుడుకు పూర్తి సంప్రదాయ బద్దంగా ఉపనయన వేడుక నిర్వహించారు. ఆ ఫొటోని మీరు ఇక్కడ చూడవచ్చు.

'తను వెడ్స్‌ మను రిటర్న్స్‌'తో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన మాధవన్‌ ఈ మధ్యనే 45వ ఏట అడుగుపెట్టాడు. సినిమా తారలు తమ వయసు చెప్పడానికి ఇబ్బంది పడుతుంటారు. అయినా అదేం దాస్తే దాగేది కాదు. ఒకవేళ ఎవరైనా తమ వయసు చెప్పకుండా దాస్తున్నారంటే వాళ్లు అభద్రతా భావంలో ఉన్నట్లే'' అంటున్నాడు మాధవన్‌.

Madhavan's Son Upanayanam function

పుట్టిన రోజు వేడుకల గురించి చెబుతూ ''ఏటా జన్మదిన వేడుకలకు దూరంగా ఉండేవాడిని. ఈ సారి మాత్రం స్నేహితులు, పరిశ్రమలోని కొంతమంది మిత్రుల సమక్షంలో పుట్టిన రోజు జరుపుకోవాలనుకుంటున్నాను. నాపై వాళ్లు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. నా తొమ్మిదేళ్ల కొడుకు నా కోసం ప్రత్యేకంగా ఒక గ్రీటింగ్‌ సిద్ధం చేశాడు. దాన్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది''అన్నాడు మాధవన్‌.

సినిమాల విషయానికి వస్తే..

2011లో విడుదలైన 'తను వెడ్స్‌ మను' మంచి విజయం సాధించింది. మాధవన్‌, కంగనా రనౌత్‌ జంటగా నటించిన ఈ చిత్రం చక్కటి కథ, కథనాలతో అటు ప్రేక్షకులను ఇటు పరిశ్రమను ఆకట్టుకుంది. ఈ చిత్రం 'మిస్టర్‌ పెళ్ళికొడుకు'గా తెలుగులోనూ రీమేకైంది. నాలుగేళ్ల తర్వాత దర్శకుడు ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ 'తను వెడ్స్‌ మను రిటర్న్స్‌' పేరిట ఆ చిత్రానికి సీక్వెల్‌ను తీసుకొస్తున్నారు. ఈ చిత్రం ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకొచ్చి విజయం సాధించింది.

.తను, మనుల మధ్య జరిగే ప్రేమకథగా మొదటిభాగం తెరకెక్కింది. లండన్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్నా సంప్రదాయాలను గౌరవించే మనోజ్‌ శర్మ(మను)గా మాధవన్‌, మగరాయుడిలాంటి అల్లరి అమ్మాయి తనూజ త్రివేది(తను)గా కంగనా అందులో కనిపించారు. రెండు భిన్న ధ్రువాల్లాంటి వీరు కొన్ని విచిత్ర పరిస్థితుల్లో ప్రేమలో పడతారు. ఆ తర్వాత వారి ప్రేమకథ ఎన్నో మలుపులు తిరిగి చివరికి పెళ్లితో సుఖాంతమవుతుంది.

రొమాంటిక్‌ కామెడీగా రూపొందిన ఈ చిత్రంలో మాధవన్‌, కంగనా పండించిన కెమిస్ట్రీ ప్రేక్షకులను గిలిగింతలు పెట్టింది. తను, మనుల వైవాహిక జీవితంలో చోటుచేసుకునే సంఘటనల నేపథ్యంలో రెండో భాగాన్ని తెరకెక్కించారు. అచ్చం తనును పోలిన అమ్మాయి అనుకోకుండా వీరి జీవితాల్లో అడుగుపెడుతుంది. తను మనస్తత్వానికి భిన్నంగా ఉండే ఆ అమ్మాయి పట్ల మను ఆకర్షితుడవుతాడు. అప్పుడు తను, మనుల వైవాహిక జీవితంలో చోటుచేసుకునే పరిణామాలేమిటన్నది తెలుసుకోవాలంటే 'తను వెడ్స్‌ మను రిటర్న్స్‌' చూడాల్సిందే.

'క్వీన్‌'తో జాతీయ పురస్కారం అందుకున్న కంగనా తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ఇదే కావడం విశేషం. మొదటి భాగంలోని తను పాత్రకు తోడు కుసుం దత్తో సాంగ్వన్‌ అనే హరియాణీ అథ్లెట్‌గానూ నటించింది.

English summary
Upanayam Function of Actor Madhavan and his wife Saritha's Son Vedanth took place in Chennai on Thursday (August 27th).
Please Wait while comments are loading...