'రోజా' మధుబాల మరో సినిమా

మధుబాలా మాట్లాడుతూ.. ''అసలు నా వెండితెర అరంగేట్రం యాధృశ్చికంగా జరిగింది. 'రోజా'లో నటిస్తానని అనుకోలేదు. పెళ్లయ్యాక కూడా మళ్లీ సినిమాల్లోకి వస్తానని వూహించలేదు. దర్శకుడు చెప్పిన కథ, విధానం బాగా నచ్చింది. అందువల్లే ఒప్పుకున్నా. నాకు తమిళమన్నా, ఇక్కడి ప్రేక్షకులన్నా చాలా ఇష్టం. ఇతర చిత్రాల్లో నటించేకంటే కోలీవుడ్‌కే నా ప్రాధాన్యమిస్తాను''అని చెప్పారు.
ఈ చిత్రంలో దుల్కర్ హీరోగా నటిస్తున్నాడు. నజ్రియ హీరోయిన్. తమిళంతోపాటు మలయాళంలో కూడా దీనిని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఆడియోను మణిరత్నం విడుదల చేయగా... నటుడు రాణా అందుకున్నాడు. ట్రైలర్‌ను కేఆర్ ఆవిష్కరించగా సెల్వరాఘవన్ స్వీకరించాడు.
మధుబాల దాదాపు పదిహేనేళ్ల విరామం తర్వాత తెలుగులో నటించిన చిత్రం 'అంతకు ముందు ఆ తర్వాత'. హీరోయిన్ గా సున్నితమైన పాత్రలు చేసి మెప్పించిన మధుబాలకు, కేరక్టర్ నటిగా కూడా అలాంటి పాత్రలే వస్తున్నాయి. అందుకే ఇప్పుడు రూటు మార్చాలనుకుంటున్నారామె. ప్రతినాయిక ఛాయలున్న పాత్రలు చేయాలనే కోరిక ఉందని మధుబాల అంటున్నారు.
ముఖ్యంగా అసూయతో రగిలిపోయి, భర్తను చంపే భార్య పాత్ర చేయాలని ఉందని పేర్కొన్నారామె. ప్రతి మనిషిలోనూ మంచి, చెడు రెండు లక్షణాలుంటాయని... మంచి లక్షణాలున్న పాత్రలు చేశాను కాబట్టి... ఇప్పుడు చెడుని కూడా ఆవిష్కరించాలనుకుంటున్నానని తెలిపారు మధుబాల.


Click it and Unblock the Notifications











