twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెండు పార్టులుగా మహేష్ బాబు చిత్రం విడుదల!?

    By Srikanya
    |

    మహేష్, మణిరత్నం కాంబినేషన్ లో రూపొందే చిత్రం నిడివి సమస్య వస్తుందని రెండు భాగాలుగా విడతీయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తమిళ, తెలుగు భాషల్లో విజయ్, విక్రమ్, మహేష్ నటిస్తున్న ఈ చిత్రం పొన్నియన్ సెల్వమ్ అనే చారిత్రిక కధాంశంతో తెరకెక్కుతోంది. స్క్రిప్టు ఎంతగా కుదించినా దాదాపు ఐదు గంటలు దాకా సినిమా నిడివి వచ్చేటట్లుగా కనపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. అయితే మహేష్ ఈ నిర్ణయానికి ఏం చెప్తారో చూసి ఫైనల్ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.అలాగే మార్కెట్ ను కూడా దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు కూడా మొదటి నుంచి రక్త చరిత్ర చిత్రం తరహాలో రెండు భాగాలుగా రూపొందించమని మణిరత్నం ని కోరుతున్నారుట. ఈ చిత్రాన్ని రజనీకాంత్ తో 'రోబో" చిత్రాన్ని నిర్మించి అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన సన్ పిక్చర్స్ తమిళ,తెలుగు భాషల్లో నిర్మిస్తున్నారు. ఇందుకోసం అమర్ కల్కి రచించిన 'పొన్ని యన్‌ సెల్వన్‌" అనే నవలను సన్‌ పిక్చర్స్‌ ఎంచుకుంది. ఐదు సంపుటాల నవలను ఇది.ఇక ప్రస్తుతం మహేష్..శ్రీను వైట్ల దర్శకత్వంలో దూకుడు చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.మహేష్ సరసన తొలిసారిగా సమంత కనిపించనుంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఆచంట గోపీచంద్, అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ అందిస్తూంటే కోన వెంకట్ మాటలు రాస్తున్నారు.

    English summary
    'Ponniyam Selvam' film's story is very big and director is finding difficulty to accommodate the script in one part ( that is in 2 and half hours screening) so director conveyed the same to Mahesh and expressed his view to make the film in two parts.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X