twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెచ్చిపోయి రచ్చ చేసిన ఫ్యాన్స్.... క్షమాపణ చెప్పిన సూపర్ స్టార్!

    |

    66వ జాతీయ చలనచిత్ర అవార్డులు ఆగస్టు 9న ప్రకటించారు. అయితే ఇందులో తమిళ సినీ పరిశ్రమకు ఒకే ఒక అవార్డు దక్కింది. 'బారమ్' ఉత్తమ తమిళ చిత్రంగా నిలిచింది. జాతీయ అవార్డుల జ్యూరీ సభ్యులు తమిళ చిత్రాలను అసలు పట్టించుకోలేదనే విమర్శలు కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వ్యక్తం అయ్యాయి.

    మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి అభిమానులు ఈ అవార్డుల తీరుపై తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తూ జ్యూరీ సభ్యుడు రాహుల్ రావయిల్ మీద విరుచుకుపడ్డారు. తమిళ మూవీ 'పెరంబు'లో మమ్ముట్టి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారని, ఆయన జాతీయ అవార్డుకు పూర్తిగా అర్హుడని, ఆయనకు అవార్డు ఇవ్వకపోవడం ఏమిటి అంటూ.. రాహుల్ రావయిల్ ఫేస్ బుక్ పేజీకి వేలాదిగా హేట్ మెసేజెస్ పంపారు.

    ఆ పోస్ట్ డిలీట్ చేసిన రాహుల్ రావయిల్

    ఆ పోస్ట్ డిలీట్ చేసిన రాహుల్ రావయిల్

    తనను తిడుతూ సందేశాలను పంపడం భరించలేక, అభిమానుల వికృత ప్రవర్తన గురించి మమ్ముట్టికి తెలిసేలా రాహుల్ రావయిల్ ఓ పోస్ట్ పెట్టారు. వారు తనను ఎంత బాధిస్తున్నారో ఆ పోస్టులో వెల్లడించారు. కారణమేంటో తెలియదు కానీ కొంతసేపటికే ఆ మెసేజ్ డిలీట్ చేశారు.

    జ్యూరీని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు

    జ్యూరీని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు

    ‘మిస్టర్ మమ్ముట్టి..నీ అభిమానుల నుంచి నన్ను తిడుతూ చాలా సందేశాలు వస్తున్నాయి. పెరంబు చిత్రంలో నటనకుగాను మా హీరోకు నేషనల్ అవార్డు ఎందుకు ఇవ్వలేదు అంటూ సోకాల్డ్ ఫ్యాన్ క్లబ్ అని చెప్పుకుంటూ నన్ను టార్చర్ పెడుతున్నారు. నేను ఈ సందర్భంగా మీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. జ్యూరీ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. ‘పెరంబు' చిత్రాన్ని రీజన్ ప్యానల్ రిజెక్ట్ చేసింది. అందుకే ఈ చిత్రం సెంట్రల్ ప్యానల్ వరకు రాలేదు. నీ అభినులు లేదా భక్తులు అయిపోయిన ఈ విషయం గురించి ఫైట్ చేసి ఎలాంటి ఉపయోగం లేదు. జ్యూరీని ప్రశ్నించడం మానుకోండి' అంటూ రాహుల్ రావయిల్ ఫైర్ అయ్యారు.

    క్షమాపణలు చెప్పిన మమ్ముట్టి

    క్షమాపణలు చెప్పిన మమ్ముట్టి

    రాహుల్ రావయిల్ ఫేస్ బుక్ పోస్టుపై మమ్ముట్టి వెంటనే స్పందించారు. తన అభిమానుల చర్యకు తాను క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. ‘‘సారీ సర్... ఈ విషయం నాకు తెలియదు. అయినప్పటికీ నేను మీకు క్షమాపణలు చెబుతున్నాను' అంటూ రిప్లై ఇచ్చారు.

    పెరంబు

    పెరంబు

    ‘పెరంబు' చిత్రంలో మమ్ముట్టి... సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్న కౌమారదశలో ఉన్న అమ్మాయికి డాటింగ్ తండ్రి పాత్రను పోషించాడు. ఈ చిత్రంలో అతడి రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్‌కు విమర్శకుల ప్రశంసలు అందాయి. చాలా మంది ఫ్యాన్స్ ఆయనకు జాతీయ అవార్డు వస్తుందని భావించారు. అయితే అలాంటిదేమీ రాకపోవడంతో అభిమానులు హర్ట్ అయ్యారు.

    English summary
    Mammootty fans sent hate messages to National Award jury Rahul Rawail. Rahul took to Facebook and sent a message to Mammootty about his fans' unruly behaviour. Rahul Rawail's post reached Mammootty's eyes who immediately apologised for his fans' behaviour.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X