»   » మణిరత్నం చిత్రంలో ఆ తెలుగు హీరో

మణిరత్నం చిత్రంలో ఆ తెలుగు హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

మణిరత్నం, మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా వస్తుందని ఆ మధ్యన వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పొన్నియన్ సెల్వన్ టైటిల్ తో రూపొందే ఆ చిత్రం భారీ బడ్జెట్ చిత్రం కావటంతో ఫైనాన్షియర్స్ ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ చిత్రాన్ని పక్కన పెట్టిన ఆయన త్వరలో ఓ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ని రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ చిత్రంలో హీరోగా రాణాని అడిగినట్లు తెలుస్తోంది. రాణా అయితే హిందీ, తమిళ మార్కెట్ కూడా టార్కెట్ చేయచ్చనేది ఆయన ఆలోచనగా ఉంది. రామ్ గోపాల్ వర్మ సలహాతోనే మణిరత్నం.. రాణాని సంప్రదించాడని తెలుస్తోంది. సఖి తరహాలో పూర్తిగా యూత్ ని టార్గెట్ చేసే చిత్రం గా ఈ సినిమాని అభివర్ణిస్తున్నారు. ఇక రాణాతో సినిమా అంటే సురేష్ ప్రొడక్షన్స్ తెలుగులో అన్ని విధాలా సహకారమిస్తుందనే నమ్మకం కూడా మణిరత్నం పెట్టుకున్నారు. రాణా ప్రస్తుతం రామ్‌గోపాల్‌వర్మ రూపొందిస్తున్న డిపార్ట్‌మెంట్ అలాగే తెలుగులో నా ఇష్టం చిత్రాల్లో నటిస్తున్నాడు.

English summary
Mani Ratnam will be seen directing Rana Daggubati soon.Rana recently completed shooting of his Telugu Film Naa Ishtam with stars Genelia as his costar in the direction of Prakash Tholeti.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu