»   » నాని-మణిరత్నం ప్రాజెక్టు ఆగటానికి కారణం

నాని-మణిరత్నం ప్రాజెక్టు ఆగటానికి కారణం

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: మణిరత్నం రీసెంట్ గా ఓ భారీ మల్టి స్టారర్ ప్రాజెక్టుని తలపెట్టారు. అయితే అది మొదలవకుండానే ప్రారంభ స్దాయిలోనే ఆగిపోయినట్లు సినీ వర్గాల సమాచారం. ఈ ప్రాజెక్టులో నానిని ఓ హీరోగా అనుకున్నారు. నాని ఈ ప్రాజెక్టు కోసం కొన్ని సినిమాలను సైతం వదులుకుని ఎదురుచూస్తున్నారు. అయితే కొన్ని కాస్టింగ్ సమస్యలతో ఈ ప్రాజెక్టు అర్దాంతరంగా ఆగిపోయినట్లు తెలుస్తోంది.

ఈ ప్రాజెక్టులో కార్తి, దుల్హర్ సల్మాన్, కీర్తి సురేష్, నిత్యా మీనన్ లను అనుకున్నారు. దుల్హర్ డేట్స్ ఎడ్జెస్ట్ కాకపోవటంతో నానితో పట్టాలు ఎక్కిద్దాముకున్నారు. అయితే కార్తీతో సమస్యల వల్ల సినిమా ఆగిందని అంటున్నారు. కొందరైతే అలాంటిదేమీ లేదు ..ప్రాజెక్టు పోస్ట్ ఫోన్ అయ్యిందంతే ఆగిపోయినట్లు కాదు అంటున్నారు. కానీ మణిరత్నం మాత్రం ధనుష్ తో సినిమా చేయటానికి రంగం సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Mani Ratnam Drops His Multi-Starrer Bilingual Due To Casting Issues?

సౌతిండియాలోనే కాదు...ఇండియన్ బెస్ట్ డైరెక్టర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న వారిలో మణిరత్నం పేరును ప్రముఖంగా చెప్పుకొవచ్చు. ఆయన దర్శకత్వంలో వచ్చిన గీతాంజలి, రోజా, బొంబాయి, ఇద్దరు, సఖి, యువ లాంటి చిత్రాను ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ప్రతి ఒక్కరి కెరీర్లో ఎత్తు పల్లాలు ఉన్నట్లే మణిరత్నం కెరీర్లోనూ హిట్లు, ప్లాపులు ఉన్నాయి. అయితే హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా మణిరత్నం సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. మణి సినిమా అంటే ప్రత్యేకంగా ఉంటుంది. నటీనటులకు గుర్తింపు తెచ్చే విధంగా ఉంటుంది. అందుకే ఆయన సినిమాలో నటించాలని ప్రతి స్టార్ కోరుకుంటాడు.

English summary
Now, the latest report that's coming in suggests that the supposedly Director Mani Ratnam's ambitious project has been shelved due to casting issues and that the Raavanan director will start working on a new film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu