Don't Miss!
- News
తారకరత్న చికిత్సలో కీలక మలుపు
- Sports
భారత్ మా బౌలింగ్ వ్యూహాలను కాపీ కొట్టింది: రమీజ్ రాజా
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Lifestyle
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
PS 2 Release Date: పొన్నియిన్ సెల్వన్ రెండవ భాగం రెడీ.. థ్రిల్లింగ్ టీజర్ తో అఫీషియల్ డేట్!
ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తమిళంలో ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద PS 1 ఏకంగా 500 కోట్లను అందుకోవడంతో ఇప్పుడు రెండో భాగంపై కూడా అంచనాలు పెరిగిపోయాయి. చోళుల చారిత్రాత్మక నేపథ్యంలో తెరపైకి వచ్చిన ఈ సినిమాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక తెలుగులో కూడా డీసెంట్ కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమాకు సంబంధించిన రెండో భాగం PS 2 రిలీజ్ డేట్ పై చాలా రోజులుగా అనేక రకాల కథనాలు వైరల్ అవుతున్నాయి. ఇక మొత్తానికి చిత్ర నిర్మాణం సంస్థ లైకా ప్రొడక్షన్స్ PS 2 రెండవ భాగానికి సంబంధించిన విడుదల తేదీపై అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా ఒక త్రిల్లింగ్ టీజర్ కూడా విడుదల చేయడం జరిగింది. చోళులు మళ్ళీ రాబోతున్నారు అంటూ పొన్నియిన్ సెల్వన్ రిలీజ్ డేట్ గురించి చెప్పారు.
Let’s get those swords in the air as we await the 28th of April 2023!#CholasAreBack #PS1 #PS2#PonniyinSelvan #ManiRatnam @arrahman @madrastalkies_ @LycaProductions @Tipsofficial @tipsmusicsouth @IMAX @primevideoIN pic.twitter.com/gqit85Oi4j
— Lyca Productions (@LycaProductions) December 28, 2022
ఈ సినిమా 2023 ఏప్రిల్ 24వ తేదీన గ్రాండ్ గా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా విడుదల కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో చియాన్ విక్రమ్, జయం రవి అలాగే కార్తీ ప్రధాన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక హీరోయిన్స్ త్రిష ఐశ్వర్యారాయ్ కూడా ముఖ్యమైన పాత్రలో హైలెట్ కాబోతున్నారు.

మొదటి భాగానికి మంచి రెస్పాన్స్ రావడం వలన ఇప్పుడు సెకండ్ పార్ట్ ఏ స్థాయిలో సక్సెస్ అవుతుంది అనేది ఆసక్తిగా మారింది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఉహాలకందని రేంజ్ లో సక్సెస్ అవుతుంది అని చిత్ర యూనిట్ గట్టి నమ్మకంతో అయితే ఉంది. ఎందుకంటే సెకండ్ పార్ట్ లో యాక్షన్ సన్నివేశాలు మరింత ఎక్కువగా ఉండబోతున్నాయని చెబుతున్నారు. మరి PS 2 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.