»   » రీఎంట్రీ : మనీషా కొయిరాలా కీలక పాత్రలో ..

రీఎంట్రీ : మనీషా కొయిరాలా కీలక పాత్రలో ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై :ఒకప్పుడు వెండితెరను ఏలిన మనీషా కొయిరాలా ఆ మధ్యన కాన్సర్ తో భాధపడి దూరమయ్యారు. ఇఫ్పుడు కోలుకుని మళ్ళీ బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆమె అర్జున్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో కనిపించటానికి సన్నాహాలు చేస్తోంది. చిత్రం పూర్తి వివరాలు క్రింద చదవండి...

'కుప్పి', 'వనయుద్ధం' వంటి చిత్రాల తర్వాత ఏఎంఆర్‌ రమేష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఒరు మెల్లియ కోడు'. ఇందులో అర్జున్‌ హీరోగా నటిస్తున్నారు. కీలక పాత్రలో శ్యామ్‌ నటిస్తున్నారు. అక్షాభట్‌ హీరోయిన్. మనీషా కొయిరాలా చాలా గ్యాప్‌ తర్వాత నటిస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Manisha Koirala to re-enter Tamil film industry with Arjun's next

ఇళయరాజా సంగీతం సమకూర్చుతున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను పూందమల్లి సమీపంలో తెరకెక్కిస్తున్నారు.

దర్శకుడు ఏఎంఆర్‌ రమేష్‌ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం పూందమల్లి సమీపంలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ సెట్‌ను లక్షలాది రూపాయలతో రూపొందించాం. సినిమాలోని ప్రధాన సన్నివేశాలన్నీ ఈ సెట్‌ దగ్గరే చిత్రీకరిస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ అర్జున్‌, శ్యామ్‌, మనీషా కొయిరాలాకు సంబంధించి సన్నివేశాల చిత్రీకరణ సాగుతోంది. మరికొన్ని రోజుల పాటు అక్కడే ఉంటాం. ఆ తర్వాత చెన్నైలో షూటింగ్‌ జరుపుతామన్నారు.

నటుడు అర్జున్‌ మాట్లాడుతూ.. నా కెరీర్‌లోనే చాలా భిన్నమైన సినిమా ఇది. తర్వాతి 20 సంవత్సరాల పాటు ఈ సినిమా తప్పకుండా నా ప్రతిభను చాటుతుంది. ఇలాంటి సినిమాలో నటిస్తున్నప్పుడు తెలియని ఆనందం.. నన్ను ఆకాశానికెత్తుతోందని చెప్పారు.

English summary
Actress Manisha Koirala, is going to make a strong comeback in Tamil cinema. The actress is impressed with a script by director AMR Ramesh, which features actors Shaam and Arjun in the lead.
Please Wait while comments are loading...