»   » మొత్తానికి అతనితోనే మీరా జాస్మిన్ మూడు ముళ్ళూ...

మొత్తానికి అతనితోనే మీరా జాస్మిన్ మూడు ముళ్ళూ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

మీరా జాస్మిన్ మొత్తానికి తన ప్రియుడు మాండలిన్ రాజేష్ ని పెళ్ళి చేసుకుని సెటిల్ అవ్వటానికి నిర్ణయించుకుంది. ఈ విషయమై నిన్న(సోమవారం) రాజేష్, అతని సోదరుడు మాండలిన్ శ్రీనివాస్ ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. అలాగే రాజేష్ త్వరలోనే తమ వివాహం త్వరలోనే జరగనుందని, వివాహానంతరం ఆమె నటించే విషయమై ఆమేకే స్వేచ్చ ఉందని అన్నారు. చాలా కాలంగా మీరా జాస్మిన్, రాజేష్ ల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. వాళ్ళిద్దరూ చెన్నైలో కొంతకాలంగా కలిసే ఉంటున్నారు. దీనిపై మీరా జాస్మిన్ కుటుంబ సభ్యులు రెండు మూడు సార్లు గొడవ కూడా చేసారు.

ఇక మీరా సోదరుడు అయితే రాజేష్ తో పెద్ద గొడవే పడ్డాడు. అప్పటి నుంచీ మీరా తన కుటుంబానికి దూరంగా ఉంటోంది. ఇక వీరిద్దరి మధ్యా ఎఫైర్ ఉందంటా చాలా కాలంగా స్పెషల్ కథనాలు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని ఇద్దరూ ఖండిస్తూ నెట్టుకు వస్తున్నారు. రాజేష్ ప్రముఖ సంగత విధ్వాంసుడు మాండలిన్ శ్రీనివాస్ సోదరుడు. అతను కూడా సంగత దర్శకుడుగా సెటిల్ అయ్యాడు. ప్రస్తుతం మీరా చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. ఆ మధ్య రిలీజైన సినిమాలన్నీఫ్లాఫ్ అయ్యాయి. మనిషి కూడా ఒళ్ళు చేసిందని నిర్మాతలు దూరం పెడ్తున్నారు. ఈ నేపధ్యంలో మీరా మ్యారేజ్ నిర్ణయం పెద్ద ఆశ్చర్యం అనిపించదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu