twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న విలన్.. మోహన్‌లాల్, విశాల్ అదుర్స్.. కథ ఇదే..

    విలక్షణ నటుడు, మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ మరోసారి సత్తా చూపించాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం విలన్ కేరళ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్నది.

    By Rajababu
    |

    విలక్షణ నటుడు, మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ మరోసారి సత్తా చూపించాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం విలన్ కేరళ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్నది. మాలీవుడ్ సినీ చరిత్రలో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా విలన్ ఓ ప్రత్యేకతను చాటుతున్నది.

    Recommended Video

    Vishal Vs Tamil Rockers విజయ్ సినిమానీ పైరసీ చేస్తాం
     తొలిరోజునే హడలెత్తించిన కలెక్షన్లు

    తొలిరోజునే హడలెత్తించిన కలెక్షన్లు

    గతేడాది మమ్ముట్టి నటించిన ది గ్రేట్ ఫాదర్ చిత్రం తొలిరోజున రూ.4.31 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ చిత్రం రికార్డును తాజాగా మోహన్‌లాల్ నటించిన విలన్ చిత్రం తుడిచిపెట్టేసింది. తొలి రోజున విలన్ చిత్రం రూ.4.91 కోట్లు వసూలు చేసింది.

     తొలివారాంతానికి 10 కోట్లు

    తొలివారాంతానికి 10 కోట్లు

    అక్టోబర్ 27న రిలీజ్ అయిన విలన్ చిత్రానికి సినీ విమర్శకులు, ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వ్యక్తం కావడంతో కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్నది. కేరళ బాక్సాఫీస్ వద్ద తొలి వారాంతానికి (మూడు రోజులకు) విలన్ చిత్రం 10 కోట్లు వసూలు చేసింది.

     ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా విలన్

    ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా విలన్

    విలన్ చిత్రం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందింది. ఈ చిత్రానికి ఉన్నికృష్ణన్ దర్శకుడు. నేర పరిశోధన కథా నేపథ్యంగా సాగే ఈ చిత్రంలో మోహన్‌లాల్ పోలీస్ డీఐజీగా నటించాడు. ఇంకా ఈ చిత్రంలో మంజు వారియర్, రాశీఖన్నా, విశాల్, హన్సిక, తెలుగు హీరో శ్రీకాంత్ తదితరులు నటించారు. హీరో విశాల్ ఈ చిత్రం ద్వారా మలయాళంలోకి ప్రవేశించాడు.

    విలన్ కథ ఇదే..

    విలన్ కథ ఇదే..

    విలన్ చిత్ర కథ ఏమిటంటే.. ఏడు నెలల సెలవుల తర్వాత డీజీపీ మ్యాథ్యూ మంజూరన్ (మోహన్‌లాల్) వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం కోసం విధుల్లో చేరుతాడు. మరో పోలీసు అధికారి సహాయంతో ఓ ట్రిపుల్ మర్డర్ కేసును దర్యాప్తు చేసే బాధ్యతను డీజీపీ చేపడుతాడు. ఈ నేర పరిశోధనలో ప్రతీ అంశం డీజీపీకి లింకు ఉన్నట్టు బయటపడుతుంది. ఈ ట్రిపుల్ మర్డర్ కేసులో డీజీపీకి ఏమిటి సంబంధం? అసలు విలన్ ఎవరు అనే ప్రశ్నలకు సమాధానమే విలన్.

    జీవించిన మోహన్‌లాల్

    జీవించిన మోహన్‌లాల్

    జీవితంలో ఊహించిన ఎదురుదెబ్బ తిన్న పోలీస్ ఆఫీసర్‌గా మోహన్‌లాల్ జీవించాడట. జీవితంలో చోటుచేసుకొన్న చేదు అనుభవానికి ప్రతీకారం తీర్చుకొనేందుకు ఎదురు చూసే పాత్రలో నటించాడు.

     పాత్రకు ప్రాణం పోసిన విశాల్

    పాత్రకు ప్రాణం పోసిన విశాల్

    విలన్ చిత్రంలో విశాల్ అద్భుతమైన టాలెంట్‌ను ప్రదర్శించాడని విమర్శకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రతినాయకుడి పాత్రకు ప్రాణం పోశాడనే మాట వినిపిస్తున్నది.

    English summary
    Mohanlal's Villain has set the Kerala box office on fire with its incredible run. Mohanlal crushed the record set by Mammootty’s The Great Father (Rs 4.31 crore) earlier this year, by raking in Rs 4.91 crore (gross) courtesy his latest release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X