»   » 'సామీ స్క్వేర్' మోషన్ పోస్టర్ అదిరిపోయింది.. విక్రమ్ పవర్ ఫుల్ లుక్, చూడాల్సిందే!

'సామీ స్క్వేర్' మోషన్ పోస్టర్ అదిరిపోయింది.. విక్రమ్ పవర్ ఫుల్ లుక్, చూడాల్సిందే!

Subscribe to Filmibeat Telugu

చియాన్ విక్రమ్ నటించిన సామి చిత్రం 2003 లో విడుదలై మంచి విజయం సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్ గా సామీ స్క్వేర్ వస్తోంది. కొద్దీ సేపటి క్రితమే ఈ చిత్ర మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్ లో పోలీస్ ఆఫీసర్ గా పవర్ ఫుల్ లుక్ లో విక్రమ్ అదరగొడుతున్నారు.

మోషన్ పోస్టర్ చూస్తుంటేనే ఈ చిత్రం మాస్ ఆడియన్స్ కు పండగ అని అర్థం అవుతోంది. మాస్ ఆడియన్స్ ని కట్టి పడేసేలా మోషన్ పోస్టర్ డిజైన్ చేసారు. విక్రమ్ సరసన ఈ చిత్రంలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్.

Motion Poster of Saamy Square released

దర్శకుడు హరి ఈ చిత్రాన్ని పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ నేపాల్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

English summary
Motion Poster of Saamy Square released. Hari is the director and Keerthy Suresh is female lead
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X