»   » రాఘవ లారెన్స్ ‘మొట్ట శివ కెట్ట శివ’ మోషన్ పోస్టర్ కేక..

రాఘవ లారెన్స్ ‘మొట్ట శివ కెట్ట శివ’ మోషన్ పోస్టర్ కేక..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై సాయి రమణి దర్శత్వంలో రాఘవ లారెన్స్ హీరోగా రూపొందుతోన్న 'మొట్ట శివ కెట్ట శివ' చిత్రాన్ని వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ తోడు తాజాగా తాజాగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు. వీటికి భారీ స్పందన రావడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.

తెలుగులో ఘనవిజయం సాధించిన 'పటాస్‌' రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో లారెన్స్ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఖాకీ డ్రెస్‌ ధరించి గుండుతో కనిపిస్తున్న లారెన్స్ స్టిల్స్‌ ఈ చిత్రంపై ఆసక్తి పెంచుతున్నాయి. పరీక్షలు, ఎన్నికలు ముగిసిన తరువాత మేలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రంలో లారెన్స్‌కు జోడీగా నిక్కీ గల్రానీ నటించింది. సీనియర్‌ సత్యరాజ్‌ కీలక పాత్రలో, కోవై సరళ, దేవదర్శిని, షామ్స్‌ సహాయకపాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్ సబ్జెక్టుతో రూపొందుతున్న ఈ చిత్రంలో లారెన్స్ మార్క్‌ కామెడీ తప్పకుండా ఉంటుందని, కామెడీ ప్లస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా 'మొట్ట శివ కెట్ట శివ' ప్రేక్షకుల్ని అలరిస్తుందని చిత్ర యూనిట్‌ భావిస్తోంది.

English summary
Motta Siva Ketta Siva Motion Poster. Raghava Lawrence Back with a Bang - Pakka MASS #MSKS #pakka mass.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu