twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Mr Perfect Thalapathy Vijay: మా హీరో రియల్ హీరోనే.. కోర్టు తీర్పుతో ఫ్యాన్స్ సోషల్ మీడియా హల్‌చల్!

    |

    ఇళయ దళపతి విజయ్‌కి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకొన్న రోల్స్ రాయిస్ కేసులో తనకు సానుకూలంగా తీర్పు లభించింది. ఇటీవల జస్టిస్ ఎస్ఎం సుబ్రమణ్యంతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ మద్రాస్ హైకోర్టులోని జస్టిస్ ఎం దురైస్వామి, ఆర్ హేమలతతో కూడిన ధర్మాసనం సంచలన నిర్ణయం తీసుకొన్నది.

    సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్

    సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్

    కొద్ది రోజుల క్రితం ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకొన్న కారుకు ఇప్పటికే దిగుమతి సుంకం చెల్లించాం. కాబట్టి ఎంట్రీ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని విజయ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే చెన్నై అసిస్టెంట్ కమిషనర్ తొలగించడంతో కోర్టుకు వెళ్లారు. అయితే సింగిల్ జడ్జి బెంచ్ జస్టిస్ ఎస్ఎం సుబ్రమణ్యం తనకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంతో మరోసారి అప్పీల్ చేసుకొన్నారు.

    సింగిల్ జడ్జి బెంచ్ మరో ధర్మాసనానికి మార్పు

    సింగిల్ జడ్జి బెంచ్ మరో ధర్మాసనానికి మార్పు

    విజయ్ అప్పీల్‌ను పరిగణనలోకి తీసుకొన్న మద్రాస్ హైకోర్టు.. ఈ కేసును మరో బెంచ్‌కు మార్చింది. జస్టిస్ ఎస్ఎం సుబ్రమణ్యం కూడిన సింగిల్ జడ్జి తీర్పును విజయ్ తరఫు లాయర్లు సవాల్ చేశారు. దాంతో జస్టిస్ ఎం దురైస్వామి, ఆర్ హేమలతతో కూడిన ధర్మాసనం విచారించింది. గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. దాంతో విజయ్ చెల్లించాల్సిన లక్ష రూపాయల జరిమానా అంశం వాయిదా పడింది. దాంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

    విజయ్ డేంజర్‌ లేడు.. ఇళయదళపతే డేంజర్

    విజయ్ డేంజర్‌ లేడు.. ఇళయదళపతే డేంజర్

    రోల్స్ రాయిస్ కారు కేసులో విజయ్‌కు అనుకూలంగా పరిస్థితులు మారడంతో అభిమానులు ట్విట్టర్‌లో #MrPerfectThalapathyVijay అనే ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తున్నారు. తమ హీరోకు అనుకూలంగా ఆదేశాలు రావడంతో మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అనే ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. తమ నటుడికి అనుకూలంగా I am Not in DANGER! I am the DANGER అంటూ ట్యాగ్ లైన్లు పెట్టి ఫోటోను షేర్ చేసి ఆనందాన్ని పంచుకొంటున్నారు.

    సకాలంలోనే విజయ్ పన్నులు..

    సకాలంలోనే విజయ్ పన్నులు..

    గతంలో విజయ్ నివాసంపై రెండు సార్లు ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేశారు. సుదీర్ఘమైన సోదాల తర్వాత అంతా సవ్యంగానే ఉన్నాయి అంటూ అధికారులు వెళ్లిపోయారు. సకాలంలోనే విజయ్ పన్నులు చెల్లించారనే విషయాన్ని ధృవీకరించారు. అందుకే విజయ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు

    సోషల్ మీడియాలో విజయ్ ఫ్యాన్స్ హంగామా

    సోషల్ మీడియాలో విజయ్ ఫ్యాన్స్ హంగామా


    గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను మద్రాస్ హైకోర్టు నిలిపివేసింది. గతంలో కోర్టు చేసిన వ్యాఖ్యలు, ఆదేశాలపై స్టే విధించింది అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కోలాహాలం సృష్టిస్తున్నారు. మా హీరో రియల్ హీరోనే అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

    English summary
    Mr Perfect Thalapathy Vijay trending after Madras court stays on Vijay's Rolls Royce case
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X