»   » ఇళయరాజా ఆరోగ్య విషయమై కుమారుడి ప్రకటన

ఇళయరాజా ఆరోగ్య విషయమై కుమారుడి ప్రకటన

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు, మెస్ట్రో ఇళయరాజా (72) ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. శ్వాస సంబంధిక సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. కాగా, ప్రస్తుతం ఆయన పరిస్థితి కుదుటపడి డిశ్చార్జి అయ్యారు. ఆయన వెంటనే తన పనిలో పడిపోయారు. ఇంకా పేరు పెట్టని చిత్రానికి ఆయన సంగీతం కంపోజ్ చేయటంలో నిమగ్నమయ్యారు. ఈ విషయాన్ని కార్తిక్ రాజా తెలియచేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అలాగే ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ కుమారుడు ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు సైతం ట్విట్టర్ లో ఇళయరాజా ఆరోగ్య విషయమై స్పందించారు. ఆయన ట్వీట్ చేస్తూ... పెద్ద నాన్న పూర్తిగా కోలుకున్నారు. ఆయనకు కొన్ని చెక్ అప్స్, వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. అభిమానులు ఆందోళన పడవద్దు అని అన్నారు.

శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయనకు శ్వాస సంబంధిత సమస్య వచ్చింది. వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కొన్ని నెలల క్రితం ఇళయరాజాకు స్వల్ప స్ట్రోక్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన్ను కార్డియాలజీ విభాగానికి తీసుకెళ్లారు.

పరీక్షించిన వైద్యులు ప్రమాదమేమీ లేదని చెప్పారు. ఇళయరాజాకు పేగులో రక్తం గడ్డకట్టిందని వైద్యులు చెప్పినట్లు సమాచారం. ఆయన్ను గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగానికి మార్చి చికిత్స అందించారు.

అయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిచేదని ఆయనకు చెందినవారు చెబుతున్నప్పటికీ ఇళయరాజా ఆస్పత్రిలో చేరారన్న వార్త ఆయన అభిమానులను కలవరపాటుకు గురిచేసింది.

Music composer Ilayaraja discharged, resumes work


1943వ సంవత్సరం జూన్ 2వ తేదీన తమిళనాడులో జన్మించిన ఇళయరాజ ఒక నిరు పేదకుటుంబంలో జన్మించారు. కటిక పేదరికాన్ని అనుభవించిన ఆయన నేడు భారతదేశ సంగీత ప్రముఖ దర్శకులలో ఒకరిగా ఎదిగారు..1976లో విడుదలైన జయప్రద నటించిన 'భద్రకాళి అనే తెలుగు చిత్రంలోని 'చిన్ని చిన్ని కన్నయ్య" అనే పాటకు సంగీతాన్ని అందించి మ్యూజిక్ డైరెక్టర్ గా సినీరంగ ప్రవేశం చేసారు. తెలుగులో 'భద్రకాళి'కి తొలిసారి సంగీత దర్శకత్వం వహించినా, ఎన్టీఆర్‌ నటించిన 'యుగంధర్‌' మొదట విడుదలయింది.

నిత్య సంగీత సాధకుడుగా మన సంగీతానికి పాశ్చాత్య సంగీతం కూడా మేళవిస్తూ చక్కని బాణీలు కూర్చడం ఆయనకు అలవాటు అయింది. దాదాపు 3 దశాబ్దాల పాటు దక్షిణ భారత సినీ పరిశ్రమను ఏలిన సంగీత నటరాజు ఇళయరాజ. ఇళయరాజ మూడు సార్లు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకోవడమేకాక, 2004లో ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.

ఇళయరాజ సంగీతం వింటుంటే ఎవరైనా సరే అమాంతం తన్మయత్వం అయిపోవాల్సిందే. అంతటి ఘనత ఆయనది. ఆయన ఇప్పటి వరకు వేల పాటలకు, వందలాది చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చారు. ఆయన స్వరపరిచిన సుస్వరాలో తేలియాడని సంగీతాభిమాని ఉండరనడంలో అతిశయోక్తి కాదేమో!

English summary
Music composer Ilayaraja has been discharged from hospital and already resumed work, his eldest son Karthik Raja said. "He was suffering from breathlessness on Friday so we admitted him to the hospital. This morning he got discharged. He already left to compose for an untitled movie," Raja told PTI.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu