»   » సిని రచయిత, చనిపోతూ కొడుక్కి రాసిన ఉత్తరం,కన్నీళ్లు పెట్టిస్తోంది

సిని రచయిత, చనిపోతూ కొడుక్కి రాసిన ఉత్తరం,కన్నీళ్లు పెట్టిస్తోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ప్రముఖ గీత రచయిత నా.ముత్తుకుమార్‌ జాండీస్ తో మరణించిన సంగతి తెలిసిందే.తన మరణం గురించి ముందే తెలుసుకున్న ఆయన తన కుమారుడికి రాసిన లేఖ అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.

కామెర్ల సమస్యతో కొద్ది కాలంగా బాద పడుతున్న ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయనకు తమిళ సినీ ప్రముఖులు కన్నీటితో తుదివీడ్కోలు పలికారు. ముత్తుకుమార్‌కు తొమ్మిదేళ్ల కుమారుడు, ఎనిమిది నెలల కుమార్తె ఉన్నారు. కొన్నిరోజుల క్రితం తన కుమారుడికి ఆయన రాసిన ఓ లేఖ ఇప్పుడు అందరినీ కన్నీరు పెట్టిస్తోంది.

ప్రస్తుతం ఈ ఉత్తరం లో ఉన్న సందేశం అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ ప్రసారమవుతూ.. పలువురిని ఎమోషనల్ చాలా బాధకు గురి చేస్తోంది. 'ఇది ప్రతీ తండ్రి, కుమారుడు తెలుసుకోవలసిన విషయం' అంటూ.. వాట్సాప్‌ గ్రూపులలో సోమవారం ఉదయం నుంచి షేర్‌ అవుతోంది. ఆ ఉత్తరంలో ఏముందో మీకు క్రింద అందిస్తున్నాం.

Na.Muthukumar's heart Touching Letter to his Son

''ముద్దుల కుమారుడికి మీ నాన్న రాస్తున్నది.. ఇది నేను రాసే మొదటి ఉత్తరం. దీన్ని చదివి అర్థం చేసుకునే వయసులో నీవు లేవు. అక్షరాలు నేర్చుకుంటూ...భాష వేళ్లు పట్టుకుని.. నడుస్తున్నావ్‌. నా దగ్గర నుంచి మా నాన్న దాచిన రహస్యాల పెట్టె తాళాన్ని నేను వెతికినట్టే.. నువ్వూ వెతుకుతావు.

కానీ జీవితంలో చాలా జాగ్రత్తగా అడుగులేయాలి. ఎక్కువగా ప్రయాణాలు చెయ్‌. ఆ ప్రయాణాలే నీకు విలువైన అనుభవాన్నిస్తాయి. పుస్తకాలను ప్రేమించు. ఒక్కో పుస్తకం.. ఒక్కో అనుభవాన్ని నేర్పుతుంది. మీ తాత, నాన్న పుస్తకాల ప్రపంచంలోనే కనుమరుగయ్యారు. నీ రక్తంలోనూ ఆ నది ప్రవహిస్తూనే ఉంటుంది. నీ దగ్గరకు వచ్చిన దొరికిన పని కన్నా.. నచ్చిన పని చెయ్‌. ఆనందమైన జీవితాన్ని కొనసాగించు.

అలాగే ఎవరైనా నిన్ను సాయం కోరితే.. అప్పు చేసి అయినా సహాయపడు. అందులో లభించే ఆనందం చాలా గొప్పది,మాటల్లో వర్ణించలేనిది. బంధువులతో సన్నిహితంగానూ ఉండు; అదే సమయంలో వారికి దూరంగానూ ఉండు. ఈ ప్రపంచంలో అన్ని బంధాలకన్నా.. విలువైనది స్నేహం మాత్రమే. మంచి స్నేహితులను చేర్చుకో. నీదారి చక్కబడుతుంది.

ఇవన్నీ.. మా నాన్న నాకు చెప్పకుండా చెప్పినవే. నేను నీకు చెప్పదలచి చెబుతున్నవి. నువ్వు జన్మించిన తర్వాతే నా తండ్రి ప్రేమను, అనురాగాన్ని అప్పుడప్పుడు అర్థం చేసుకోగలిగా. రేపు నీకో కొడుకు పుడితే అప్పుడు నా ప్రేమానురాగాలు అర్థమవుతాయి.

రేపు, ఎప్పుడో నువ్వు నీ మనవళ్లతో ఏదో ఒక వూరిలో నవ్వులొలుకుతూ మాట్లాడుతున్నప్పుడు నా జ్ఞాపకం వస్తే.. ఈ ఉత్తరాన్ని ఒక్కసారి తీసి చూడు! నీ కంటిలో నుంచి వచ్చే కన్నీటిలో నేనుంటా''...

ఇట్లు..
మీ నాన్న,
నా.ముత్తుకుమార్‌.'' అని రాశారు.

English summary
Two-time national award-winning lyricist Na. Muthukumar succumbed to jaundice in Chennai on Sunday. He was 41 and is survived by his wife, a son and a daughter. Muthukumar last tetter written for his son.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu