»   »  నమితా నీకిది తగునా?

నమితా నీకిది తగునా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Namitha
'జెమిని సినిమాతో' భైరవి గా తెలుగు వారికి పరిచయమైన భారీ అందాల సుందరి నమిత ఇప్పడు నిర్మాతల్ని ముప్పు తిప్పలు పెడుతోందిట. తమిళంలో ఈ మధ్య సి.సుందర్ కాంబినేషన్ లో చేసిన సినిమా పెద్ద హిట్టవటం తో ఆమె ప్రవర్తనలో మార్పు కనిపిస్తోందిట. దర్శకులని, నిర్మాతల్ని చిన్నచూపు చూడటం, రకరకాల కండీషన్స్ పెట్టడం జరుగుతోందిట. తాజాగా తిరు అనే తమిళ దర్శక, నిర్మాత నమితపై తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశాడు. 2006లో ప్రారంభమైన ఒక సినిమాకు ఇచ్చిన డేట్స్ ప్రకారం షూటింగ్‌కు హాజరు కాకుండా నిర్మాతలకు చుక్కలు చూపిస్తోంది ఈ చక్కని చుక్క . ఆ సినిమా చేయడానికి అప్పట్లో నమిత 17 లక్షల రూపాయల అడ్వాన్స్ తీసుకుంది. అయితే షూటింగ్ మొదలైన మూడో రోజే దర్శకుడు మారాడు. దాంతో షెడ్యూలు డిలే అవటం ఫ్రారంభమయింది. ఈ క్రమంలో ఆమె ఆ సినిమా చేయడానికి ఆసక్తి చూపలేదు. రోజులు గడిచి నమిత దశ తిరగటం ఫ్రారంభమై రెమ్యునరేషన్ పెరిగింది. దాంతో ఆ సినిమా పూర్తి చేయాలని తిరు నడుం కట్టి నమితను కలిసాడు. ఆమె కిది నచ్చనట్టుంది. దాంతో దర్శకుడు తిరు ఇటీవల తనను ఒక హోటల్ వద్ద వేధించాడని నమిత ఆరోపించింది. దాంతో రగిలిపోయిన తిరు నిర్మాతల మండలికి నమితపై ఫిర్యాదు చేశాడు. కధంతా తెల్సిన వాళ్ళు ఎటు వైపు న్యాయం చెప్పాలో తల పట్టుకు కూర్చున్నారట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X