»   » నయనతారపై కంప్లైంట్ విషయమై...శింబు వివరణ

నయనతారపై కంప్లైంట్ విషయమై...శింబు వివరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై:శింబు తండ్రి టి రాజేందర్ రీసెంట్ గా తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మరియు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అశోశియేషన్ ని కలిసి నయనతారపై కంప్లైంట్ చేసారు. ఆమె చిత్రం విషయంలో కోఆపరేట్ చేయకపోవటంతో చాలా నష్టపోవాల్సి వస్తుందని తెలియచేసారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయమై నయనతార చాలా సీరియస్ గా ఉంది. మీడియాలో ఇది చర్చనీయాంశంగా మారింది. దాంతో శింబు నోరు విప్పి ఏం జరిగిందో వివరించే ప్రయత్నం చేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

శింబు మాట్లాడుతూ..."మా నాన్నగారు ఆ సినిమాకు నిర్మాత. మేం నయనతారకు ఇవ్వాల్సిన 50 లక్షల చెక్ విషయమై ఆమెను కంటాక్ట్ చేయటానికి ప్రయత్నిస్తే స్పందన లేదు. ఆమెను ఆ డబ్బు తీసుకుని ఇంకా రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ కాల్ షీట్స్ అడుగుదామనే ప్రయత్నం. ఆమె రెస్పాండ్ కాకపోవటంతో మా నాన్నగారు వెంటనే నిర్మాతల మండలి ,నడిగర సంఘంని ఎప్రోచ్ అయ్యారు. అక్కడ ఈ మొత్తాన్ని డిపాజిట్ చేసాం. అప్పుడు నడిగర సంఘం వారు రిటెన్ గా ఓ లెటర్ ఇమ్మన్నారు ఈ ఇష్యూపై. దాంతో మా తండ్రి ఇవ్వటం జరిగింది. దాన్ని కంప్లైంట్ అంటే ఏం చెప్తాం. ?," అని శింబు ఎదురు ప్రశ్నించాడు.

Nayantara's Controversy: No Complaint, Only Request!

అంతేకాకుండా ఈ చిత్రం అనుకున్న సమయానికే విడుద అవుతుందని చెప్తూ ట్వీట్ చేసారు.

వివాద వివరాల్లోకి వెళితే...

శింబు ప్రస్తుతం నయనతారతో కలిసి'ఇదు నమ్మఆళు' అనే చిత్రంలో నటిస్తున్నారు. నయనతారతోనూ ఇదివరకు ప్రేమాయణం సాగించాడు శింబు. ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తడంతో విడిపోయారు. ఇప్పుడు మళ్లీ కలిసి నటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రమే మరోసారి వీరి మధ్యన విభేధాలు పెరగటానికి కారణమవబోతోంది.

తమిళ సినీ వర్గాల సమాచారం ప్రకారం కొద్ది రోజులు షూటింగ్ జరిగిన తర్వాత ఇప్పుడు నయనతార తాను ఇక సినిమాలో నటించనని తేల్చి చెప్పిందని సమాచారం. దాంతో వేరే దారి లేక చిత్రం హీరో శింబు ఆమెపై కంప్లైంట్ చేసారు. శింబు రీసెంట్ గా తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మరియు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అశోశియేషన్ ని కలిసి ఆమెపై కంప్లైంట్ చేసారు. ఆమె చిత్రం విషయంలో కోఆపరేట్ చేయకపోవటంతో చాలా నష్టపోవాల్సి వస్తుందని తెలియచేసారు.

Nayantara's Controversy: No Complaint, Only Request!

ఈ విషయమై నయనతార మీడియాతో మాట్లాడుతూ... "నేను ఈ చిత్రం కోసం ఇచ్చిన డేస్ ఇప్పటికే అయిపోయాయి. వారు వాటిని వాడుకోలేదు. ఇప్పుడు నేనే వేరే ప్రాజెక్టులలో పూర్తి బిజీగా ఉన్నాను. ఆ చిత్రం కోసం ఫ్రెష్ గా కాల్ షీట్స్ పరిస్ధితుల్లో లేను. అలా చేస్తే మిగతా నిర్మాతలకు ఇబ్బంది కలుగుతుంది " అని ఆమె తేల్చి చెప్పారు. ఇంకా ఓ పాట,కొన్ని సీన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి.

ఈ చిత్రాన్ని టి రాజేందర్, ఉషా రాజేందర్, శింబు, కులరాసన్, ఇలైక్య తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నారు. శింబు సినీ ఆర్ట్స్ పేరిట నిర్మిత మవుతున్న ఈ చిత్రానికి పసంగ చిత్రంతో నేషనల్ అవార్డు పొందిన పండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.

English summary
Finally, Simbhu broke the silence to clear the air. Faulting the way media blown it out of proportion, He made it clear that no complaint was registered against Nayantara.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu