»   » నయనతార ఆట ఆరంభమైంది

నయనతార ఆట ఆరంభమైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : కోలీవుడ్ లో ఇప్పుడు అందరి దృష్టీ హిట్‌ పెయిర్ జంట అజిత్‌- నయనతార లపై ఉంది. వీరి తాజా చిత్రం 'ఆరంభం'. ఈ చిత్రం తెలుగులో ఆట ఆరంభం అనే టైటిల్ తో వస్తోంది. వీరి కలయికలో తెరకెక్కిన తొలి చిత్రం 'బిల్లా'. రికార్డుల పరంగా కొత్త అధ్యాయాన్ని లిఖించింది. రూ.16 కోట్లతో తెరకెక్కిన బిల్లా సుమారు రూ.64 కోట్ల మేర వసూళ్లు సాధించి 2008లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. చిత్రంలోని యాక్షన్‌ సన్నివేశాలు, మలేషియా అందాలే కాక అజిత్‌- నయనతార జంట ప్రేక్షకులను ప్రధానంగా ఆకర్షించింది. ఈ ఒక్క చిత్రంతోనే ఈ జంట హాట్‌ హిట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకుంది.

బిల్లా తర్వాత వీరి కలయికలో వచ్చిన 'ఏగన్‌'.. సినిమా పరంగా ఆకట్టుకోకపోయినా అజిత్‌- నయనతార జంట ఎప్పటిలానే ఫుల్‌ మార్కులు కొట్టేసింది. ప్రారంభ వసూళ్లు రాబట్టే అంశాల్లో ఒకటిగా ఈ జంట పేరు తెచ్చుకుంది. దీని కారణంగా ప్రస్తుతం వీరి కలయికలో రానున్న 'ఆరంభం'పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఛాయాచిత్రాలలో ఈ జోడీ కన్నుల పండువగా ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వెండితెరపైనా సమ్మోహనపరిచేందుకు దీపావళి రోజు నుంచి సందడి చేయనుందీ జంట.

Aata Arambam

'ఆరంభం' గతంలో వచ్చిన 'బిల్లా'ను మించిన వేగంతో ఉంటుందని దర్శకుడు విష్ణువర్ధన్‌ పేర్కొంటున్నాడు. అజిత్‌కు జంటగా నయనతార నటిస్తుండగా, మరో జంటగా ఆర్య-తాప్సీ కనిపించనున్నారు. ఈ చిత్రం ఖచ్చితంగా అజిత్ కెరీర్ లో పెద్ద హిట్ నమోదు చేస్తుందని హామీ ఇస్తున్నాడు. విష్ణువర్ధన్‌ మాట్లాడుతూ.. 'బిల్లా'లాంటి మెగాహిట్‌ తర్వాత అజిత్‌తో మరోసారి పని చేయటం ఆనందంగా ఉంది. 'మంగాత్తా'లో సగానికి పైగా నెరసిన వెంట్రుకలతో కనిపించిన అజిత్‌ ఇందులోనూ అదే గెటప్‌లో అలరించనున్నాడు. అలా చూపాలని మా యూనిట్‌ ముందుగానే అనుకుంది. వెంకట్‌ ప్రభు మాకన్నా వేగంగా స్పందించి 'మంగాత్తా'లో ఆ క్రెడిట్‌ కొట్టేశాడు.

'ఆరంభం' ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. స్క్రీన్‌ప్లేలో 'బిల్లా'ను మించే వేగం ఉంటుంది. తమిళ ప్రేక్షకులందరికీ నచ్చేలా ఉంటుందని వివరించాడు. కథ గురించి ప్రస్తుతానికి ఏమీ చెప్పలేం. ఇంకా చాలా పనులున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. ప్రతి ఫ్రేమూ ఎంతో కష్టపడి చిత్రీకరించాం. కేవలం అజిత్‌ అభిమానులకే కాదు.. అందరికీ ఈ సినిమా నచ్చుతుందని చెప్పగలను. అజిత్‌కు తగ్గట్టు పలు పంచ్‌ డైలాగులున్నాయి. 'తుప్పాక్కి వైతిరుక్కురవన్‌ పేసమాట్టాన్‌'.. (తుపాకి ఉన్నవాడు పెద్దగా మాట్లాడడు) వంటి సంభాషణలు థియేటర్‌లో పేలడం ఖాయం. అజిత్‌, ఆర్య కలయిక అనుకున్నట్టే క్లిక్‌ అయింది. ఇక ప్రేక్షకుల ముందు తెరపై పండటమే మిగిలి ఉంది. ఆ విషయాన్ని త్వరలో మీరే చూస్తారుగా అని ముగించారు.

English summary
Ajith's 'Arrambam' is already the latest talk of the town. The movie has already created the needed pre-release buzz with its sleek trailer and the electrifying first looks.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu