»   »  తమిళ రీమేక్ గా మరో తెలుగు హిట్

తమిళ రీమేక్ గా మరో తెలుగు హిట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : గత ఏడాది తెలుగులో విజయవంతమైన చిత్రం 'స్వామి రారా'. నిఖిల్‌, స్వాతి జంటగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం తమిళ ప్రేక్షకులను అలరించేందుకు రీమేక్‌గా సిద్ధమవుతోంది. విలువైన పురాతన ఓ వినాయక విగ్రహం జేబుదొంగతనాలు చేసే హీరో చేతికి వచ్చాక.. ఎలాంటి ఆసక్తికర సంఘటనలు జరిగాయన్నదే కథాంశం. తమిళంలో 'సామియాట్టం' పేరిట రీమేక్‌ అవుతోంది. నిఖిల్‌ పాత్రలో శ్రీకాంత్‌, స్వాతి పాత్రలో ముంబయి హీరోయిన్‌ నటిస్తోంది. 'యారడీ నీ మోహిని', 'ఉత్తమ పుత్రన్‌' వంటి సినిమాలను తెరకెక్కించిన మిత్రన్‌ ఆర్‌.జవహర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత: శ్రీకాంత్‌, సినిమాటోగ్రఫీ: బాబు యోగేశ్వరన్‌.

రామ్ గోపాల్ వర్మ అనగనగా ఒక రోజు, క్షణ క్షణం చిత్రాలకు గుర్తు చేస్తూ సాగే ఈ చిత్రం మార్నింగ్ షోకే హిట్ టాక్ తెచ్చుకుంది. నిఖిల్ గత ఫ్లాప్ చిత్రాల ఎఫెక్టుతో ఓపినింగ్స్ లో ఊపు లేకపోయినా తర్వాత టాక్ స్ప్రెడ్ కావటంతో పుంజుకుని నిలదొక్కుకుంది. ఈ చిత్రం కన్నడ వెర్షన్ లో...ప్రజ్వల్ హీరోగా చేస్తూండగా..కలర్స్ స్వాతి పాత్రను..సంజన చెల్లెలు...నిక్కి చేస్తోంది. ఈ చిత్రం విష్ణు డైరక్ట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని నిఖిల్ ట్విట్టర్ లో ఖరారు చేస్తూ ట్వీట్ చేసారు. ఈ చిత్రానికి హీరో నారా రోహిత్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. రొమాంటిక్,యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందిందారు.

Nikil's Swamy Ra Ra going to Kollywood

చిత్రంలో వినాయకుడి విగ్రహానికీ, ఓ దొంగ ప్రేమ కథకూ సంబంధం ఏమిటనేది ఆసక్తికరం. కథ ప్రకారం సూర్య (నిఖిల్‌) ఓ జేబుదొంగ. బతుకుదెరువు కోసం దొంగతనాలు చేస్తుంటాడు. అతనికి స్వాతి (స్వాతి) అనే ఓ పాత్రికేయురాలితో పరిచయం అవుతుంది. మరోవైపు అనంతపద్మనాభస్వామి గుడిలో కనీవినీ ఎరుగని సంపద దొరుకుతుంది. అయితే అందులోంచి ఓ వినాయక విగ్రహం మాయం అవుతుంది. ఆ విగ్రహం కోసం కొంతమంది అన్వేషణ మొదలుపెడతారు. సూర్య, స్వాతిలు కూడా విఘ్నేశ్వరుడి కోసం వేట ప్రారంభిస్తారు. ఇంతకీ ఆ విగ్రహం ఏమైంది? ఎవరికి దొరికింది? అనేదే చిత్ర కథ.

English summary
Nikhil and Swathi's Swamy Ra Ra directed by Sudhir Varma is getting remade in Kollywood. Tamil hero Srikanth who is known as Sriram in Telugu is starring and producing the film on his banner Golden Pride.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu